ట్రంప్ డాడీ వాట్ ఈజ్ దిస్? యూరోపియన్ పైనే కామెంటా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం నానాటికీ విచిత్ర పోకడలు పోతోంది. ఆయన వివాదాస్పదం కాని విషయమంటూ ఏదీ లేదా అనిపిస్తుంటుంది.
By: Tupaki Desk | 10 Dec 2025 4:15 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం నానాటికీ విచిత్ర పోకడలు పోతోంది. ఆయన వివాదాస్పదం కాని విషయమంటూ ఏదీ లేదా అనిపిస్తుంటుంది. అన్నింటా నేనే అంటారు. తనో శాంతిదూతగా ప్రకటించుకుంటారు. నోబెల్ పురస్కారం ఇవ్వరా అయితే మీ ఖర్మ అంటారు కూడా. ఎన్నో దేశాల మధ్య యుద్దాలు ఆపిన శాంతిదూతను నేనే కదా అని స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. అదే సమయం భారత్ లాంటి వర్దమాన దేశాలపై అనవసర అక్కసు వెళ్ళగక్కుతుంటారు. రష్యాతో కటీఫ్ చెప్పకుంటే మీకు ప్రతీకార ఎగుమతి సుంకాలు ఖాయం అని బెదిరిస్తుంటారు. మొత్తానికి వివాదాల ట్రంప్ గారు తాజాగా మరో అంశంపై విదాదనికి తెరలేపారు.
యూరోపియన్ అనుసరిస్తున్న విధానాలు సక్రమంగా లేవు అవి విపత్తుకు దారితీసేలా ఉన్నాయని పొలిటికల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ ఇపుడు ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా , దాని మిత్రదేశాల మధ్య ఉద్రిక్త వాతారణానికి కారణాలుగా నిలుస్తున్నాయి. అలాగే నాటో కూటమి తనను డాడీ అని పిలుస్తుందని అంటూనే రక్షణ వ్యయం పై యూరోపియన్ దేశాలు ఉత్తినే మాట్లాడుతుంటాయని కానీ సమయం వచ్చినపుడు యుద్దం కొనసాగుతున్నప్పుడు మాత్రం సాయం చేయవని ఆరోపించారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన మధ్య యుద్దానికి పుల్ స్టాప్ పెట్టించాలని అమెరికా అధ్యక్షుడు చేస్తున్ విశ్వ ప్రయత్నాలను యూరోప్ దేశాలు విభేదిస్తున్నాయి. కారణం..రష్యాకు ఎక్కడ కైవ్ భూభాగాన్ని సమర్పించుకోవలసి వస్తుందనే.
ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీని కోరుతున్నారు. ఎన్నికలు వాయిదా పడుతుంటే...ఇక ప్రజాస్వామ్యం ఆశించడం వృథా అనుకునే దశకు ప్రజలు చేరుకుంటారని , అది చాలా ప్రమాదకరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. యుద్దంల మరణాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. దీనికి జెలన్ స్కీ స్పందిస్తూ మొదట యుద్ధం ఆపి శాంతివాతావరణం నెలకొల్పగలిగితే...తాను ఎన్నికలకు సిద్ధమని అన్నారు.
అలాగే వలసల విషయంగా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. కేవలం వలసల వల్లే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు నాశనమవుతున్నాయని విమర్శించారు. యూరోపియన్ దేశాలు వలసల్ని నివారించడంలో ఘోరంగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో వలసల విధానం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికా జాతీయ భద్రత వ్యూహం కింద హెచ్ 1బి వీసాలు, బర్త్ రైట్ లాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటోంది. ఏది ఏమైనా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి యూరోపియన్ పై పడ్డారు అంతే.
