Begin typing your search above and press return to search.

ట్రంప్ రెండో పెళ్లిలో ఎప్ స్టీన్ సందడి... తెరపైకి సంచలన సాక్ష్యాలు!

ఈలోపే ఎప్ స్టీన్ తో ట్రంప్ కు ఉన్న సంబంధాలు, అనుబంధాలపై అమెరికా మీడియాలో కథనాలు, పలువురి ఇంటర్వ్యూలు, ఇంకొందరి ఆరోపణలు హల్ చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 July 2025 4:15 PM IST
ట్రంప్ రెండో పెళ్లిలో ఎప్ స్టీన్ సందడి... తెరపైకి సంచలన సాక్ష్యాలు!
X

అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం.. ట్రంప్ కు సరికొత్త తలనొప్పులు తెస్తోందనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఎప్‌ స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం వివరాలు వెల్లడిస్తానని కబుర్లు చెప్పిన ట్రంప్.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకుల్లానే మాట మార్చారు. అది టైం వేస్ట్ వ్యవహారం అంటున్నారు.

ఈలోపే ఎప్ స్టీన్ తో ట్రంప్ కు ఉన్న సంబంధాలు, అనుబంధాలపై అమెరికా మీడియాలో కథనాలు, పలువురి ఇంటర్వ్యూలు, ఇంకొందరి ఆరోపణలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఎప్‌ స్టీన్‌ తో ట్రంప్‌ రాసుకుపూసుకు తిరిగిన ఫొటోలను వెలికితీస్తున్నాయి. ఈ సమయంలో ఎప్ స్టీన్ – ట్రంప్ సన్నిహిత సంబంధంపై సీ.ఎన్.ఎన్. సంచలన ఫోటోలు విడుదల చేసింది.

వును... మొన్న వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ బర్త్‌ డే లెటర్‌ ను బహిర్గతం చేయగా.. నిన్న కళాకారిణి మారియా ఫార్మర్‌ తనవైపు ట్రంప్ అదోలా చూశారని, అప్పుడు ఆయనను ఎప్ స్టీన్ తీసుకుని వెళ్లిపోయారని తన అనుభవాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ తో పంచుకోగా... తాజాగా ట్రంప్‌ రెండో పెళ్లిలో ఎప్‌ స్టీన్‌ చేసిన హడావుడికి సంబంధించిన సీఎన్‌ఎన్‌ ఫొటోలతో సహా బయటపెట్టింది.

గత కొన్ని రోజులుగా అమెరికాలో ఎఫ్ స్టీన్ ఫైల్స్ పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పొలిటికల్ గా రిపబ్లికన్స్ కు డెమోక్రాట్లకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సందర్భంగా చాలా వేళ్లు ట్రంప్ వైపు చూపిస్తున్నాయని అంటున్నారు. ట్రంప్ మాత్రం... జెఫ్రీ ఎప్‌ స్టీన్‌ తో తనకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పుకొస్తున్నారు.

అయితే... అమెరికా మీడియా మాత్రం ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్దంగా ఆధారాలతో సహా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా పత్రిక సీఎన్‌ఎన్‌.. ట్రంప్‌ - ఎప్‌ స్టీన్‌ కలిసి పాల్గొన్న పలు కార్యక్రమాల ఫోటోలు, వీడియోలను వెలుగులోకి తీసుకొచ్చింది. వీటిల్లో 1993లో న్యూయార్క్‌ లోని హోటల్‌ లో జరిగిన ట్రంప్‌ రెండో పెళ్లిలో ఎప్‌ స్టీన్‌ పాల్గొన్న దృశ్యాలూ ఉన్నాయి.

వీటితో పాటు 1990-2000 మధ్య న్యూయార్క్‌ లో జరిగిన విక్టోరియా సీక్రెట్‌ ఫ్యాషన్‌ షోలో ట్రంప్ - ఎప్‌ స్టీన్‌ పాల్గొనడం.. ఇద్దరు మాట్లాడుకోవడం వంటి ఆధారాలనూ సేకరించింది. ఇక ఎప్‌ స్టీన్‌ 50వ పుట్టిన రోజు సందర్భంగా... అతనికి ట్రంప్‌ పంపిన శుభాకాంక్షల లేఖను వాల్‌ స్ట్రీట్‌ ఇటీవల బయటపెట్టింది!

ఈ సందర్భంగా... తాజాగా తన పెళ్లి ఫొటోలు బయటకు రావడం, అందులో ఎఫ్ స్టీన్ సందడి చేయడంతో ట్రంప్‌ సీఎన్‌ఎన్‌ కు ఫోన్‌ చేసి 'నన్ను ఆట పట్టిస్తున్నారా..?' అని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కాగా... 2002లో ఓ సందర్భంలో న్యూయార్క్‌ మ్యాగ్జైన్‌ తో మాట్లాడిన ట్రంప్... ఎప్‌ స్టీన్‌ అద్భుతమైన వ్యక్తి అంటూ కితాబిచ్చిన సంగతి తెలిసిందే.