Begin typing your search above and press return to search.

ట్రంప్ - మస్క్... టీకప్పులో తుఫానుగా మారిన వేళ అప్ డేట్ ఇదే!

గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Jun 2025 12:00 PM IST
ట్రంప్ - మస్క్... టీకప్పులో తుఫానుగా మారిన వేళ అప్ డేట్  ఇదే!
X

గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. మీడియాలో ట్రంప్, సోషల్ మీడియాలో మస్క్ లు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకున్నారు. ఒకానొకదశలో ఇవి శృతిమించాయనే కామెంట్లు వినిపించాయి. అయితే.. తాజాగా వీరి మధ్య రచ్చ ఫైనల్ గా టీకప్పులో తుఫానుగా మారిందని తెలుస్తోంది.

అవును... డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం టీకప్పులో తుఫానుగా మారిందని.. ఈ నేపథ్యంలో మళ్లీ వారి మధ్య స్నేహం చిగురించిందని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ కు మస్క్ ప్రైవేట్ ఫోన్ చేసి, బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. దీంతో.. ట్రంప్ కూడా ఎలాన్ మస్క్ ను క్షమించారు. ఈ విషయాని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ వెల్లడించారు.

బుధవారం ఎక్స్ వేదికగా స్పందించిన మస్క్... అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన తన పోస్టులపై చింతిస్తున్నట్లు చెప్పారు. అవి చాలా దూరం వెళ్లాయని విచారం వ్యక్తం చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై సోమవారం రాత్రి ట్రంప్ తో మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ మాట్లాడినట్లు కథనాలొస్తున్నాయి. ఆ ఫోన్ కాల్ లో ట్రంప్ కు మస్క్ సారీ చెప్పినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యల్మోనే కరోలిన్ లివిట్ స్పందిస్తూ... ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారని.. దీన్ని ఆయన అభినందించారని.. అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి కొనసాగుతోందని ఆమె వెల్లడించారు. మస్క్ కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా అనే ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని ఆమె సమాధానం ఇచ్చారు.

కాగా... అమెరికా ప్రభుత్వం రూపొందించిన "బిగ్ బ్యూటీఫుల్ బిల్లు" ను ఎలాన్ మస్క్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో... సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్ స్టెన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో... తన మద్దతు లేకపోయి ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచేవారు కాదని మస్క్ అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదని అన్నారు. అతడు లేననంత మాత్రాన్న తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని చెబుతూ.. తాను తప్ప ఎవరు లేకపోయినా అమెరికాకు ఏమీ కాదని తెలిపారు!