ఆప్షన్ తీసేశారు: ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ లో ఆడ.. మగ మాత్రమే
రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన మెదడులో పుట్టే ఆలోచనలకు తగ్గట్లు అమెరికాను మార్చేయాలన్న కంకణం కట్టుకున్నారు.
By: Tupaki Desk | 5 April 2025 10:00 PM ISTరెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన మెదడులో పుట్టే ఆలోచనలకు తగ్గట్లు అమెరికాను మార్చేయాలన్న కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే బోలెడన్ని నిర్ణయాలు తీసుకొని అమెరికన్లకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ కు.. ఆడ, మగ కాని మూడో వర్గాన్నితాను గుర్తించననే విషయాన్నిఇప్పటికే పలుమార్లు కుండ బద్దలు కొట్టారు.
ఇప్పటివరకు మాటల్లో చెప్పిన పెద్ద మనిషి.. తాజాగా చేతల్లోనూ చూపించేశారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల్లో అమెరికా పౌరసత్వం.. ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ కీలకమైన మార్పును పేర్కొంది. ఇకపై అప్లికేషన్లలో అయితే ఆడ.. లేదంటే మగ అని మాత్రమే రాయాలని స్పష్టం చేసింది. అంతే తప్పించి.. మరే వర్గాన్ని పేర్కొన్న ఒప్పుకోమని స్పష్టం చేసింది.
ఈ మార్పు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. దీంతో 2023లో బైడెన్ సర్కారు ప్రవేశ పెట్టిన ఇతర జెండర్ ఎంపిక అవకాశాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్త పాలసీని తీసుకొచ్చారు. లింగ నిర్థారణకు బర్త్ సర్టిఫికేట్ లేదంటే దానికి సమానమైన ధ్రువీకరణను మాత్రమే పరిణలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. మొదట్నించి మూడో వర్గాన్ని అస్సలు అనుమతించని ట్రంప్.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్న వైనం.. స్వేచ్ఛా స్వాతంత్య్రం ఎక్కువగా ఉండే అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతుందని చెప్పాలి.
