Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌కు ముందు ఆస్తులు గ‌ల్లంతు.. ఎంత క‌ష్టం వ‌చ్చింది ట్రంపూ!

ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న ఆస్తులు గ‌ల్లంతు కావ‌డం రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఇబ్బంది కానుంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 March 2024 2:45 AM GMT
ఎన్నిక‌ల‌కు ముందు ఆస్తులు గ‌ల్లంతు.. ఎంత క‌ష్టం వ‌చ్చింది ట్రంపూ!
X

కీల‌క‌మైన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు మాజీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఫైర్‌బ్రాండ్‌గా నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై పిడుగు ప‌డింది. ఆయ‌న‌పై కేసుల నేప‌థ్యంలో ఆయ‌న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునేందుకు రంగం రెడీ అయింది. న్యూయా ర్క్‌ అటార్నీ జనరల్ ఈ మేర‌కు ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన చర్యలు ప్రారంభంచారు. దీంతో ట్రంప్ స‌హా ఆయ‌న మ‌ద్ద‌తు దారులు తీవ్ర ఆందోళ‌న‌, ఆవేద‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న ఆస్తులు గ‌ల్లంతు కావ‌డం రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఇబ్బంది కానుంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఏం జ‌రిగింది?

ట్రంప్‌పై గ‌త ఏడాది కాలంలో ప‌లు కేసులు న‌మోదయ్యాయి. వీటిలో బ్యాంకును మోసం చేశార‌నే కేసు తీవ్ర‌మైంద‌ని కోర్టులు పేర్కొన్నాయి. ఆస్తుల విలువపై ఏళ్ల తరబడి అసత్యాలు చెప్పి బ్యాంకులు, బీమా కంపెనీలను మోసం చేశారని న్యూయార్క్‌ న్యాయస్థానం పేర్కొంది. అదేవిధంగా లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌(స‌హ‌జీవ‌నం చేశార‌న్న వాద‌న ఉంది)కు 83.3 మిలియన్‌ డాలర్లు (రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని మాన్‌హటన్‌ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇక‌, బ్యాంకుల‌ను మోసం చేసిన కేసు ఓడిపోతే కచ్చితంగా అపరాధ రుసుం చెల్లించేలా గ్యారెంటీ మొత్తాన్ని ఇచ్చి తీరాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు ఇది రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్‌ అంటున్నారు. ఇంత‌లోనే ఆయ‌న ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిద్ధ‌మైంది. మొత్తం 355 మిలియ‌న్ డాల‌ర్లు(35 కోట్ల‌రూపాయ‌లుపైగా) స‌హా దీనిపై వ‌డ్డీని కూడా చెల్లించాల‌ని పేర్కొంది.

దీంతో ఈ మొత్తం ఏకంగా 45.5 కోట్ల రూపాయ‌ల‌కు చేరింది. అయితే.. ఈ మొత్తం ట్రంపు ఆస్తుల‌తోపాటు ఆయ‌న కుమారులు జూనియర్‌ ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, ట్రంప్‌ ఆర్గనైజేషన్ కూడా చెల్లించాల‌ని న్యూయార్క్ కోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. ఈ సొమ్ము చెల్లించేందుకు ట్రంప్‌ ఇప్పటి వరకు ఎలాంటి యత్నం చేయకపోవడంతో అటార్నీ జనరల్‌ తదుపరి చర్యలు చేపట్టారు. ఉత్తర మాన్‌హట్టన్‌లోని ఆయన ప్రైవేటు ఎస్టేట్‌ సెవన్‌ స్ప్రింగ్స్‌, గోల్ఫ్‌ కోర్సుల‌ను స్వాధీనం చేసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

ఇవీ స్వాధీనం చేసుకునే ఆస్తులు

+ సెవన్‌ స్ప్రింగ్స్‌ ఎస్టేట్‌: 230 ఎకరాలు. 1919లో నిర్మించారు. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 7.5 మిలియన్‌ డాలర్లుకు 1996లో కొనుగోలు చేసింది.

+ గోల్ఫ్‌ కోర్స్‌: 75,000 చదరపుటడుగుల క్లబ్‌ హౌస్‌. దీనిని 1922లో ఏర్పాటు చేశారు.