Begin typing your search above and press return to search.

వరల్డ్‌ కప్‌ తయరీ వెనక ఆసక్తికర విషయాలు... ఫస్ట్ పేరు వేరే!

వైసీసీ వన్ డే వరల్డ్‌ కప్‌ 2023 ముగిసింది. ఈసారి వరల్డ్‌ కప్‌ లో టీమిండియా లీగ్ దశలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచినప్పటికీ... ఫైనల్‌ ఓటమి అందరినీ బాధకు గురి చేసింది

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:42 AM GMT
వరల్డ్‌ కప్‌ తయరీ వెనక ఆసక్తికర విషయాలు... ఫస్ట్ పేరు వేరే!
X

ఐసీసీ వన్ డే వరల్డ్‌ కప్‌ 2023 ముగిసింది. ఈసారి వరల్డ్‌ కప్‌ లో టీమిండియా లీగ్ దశలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచినప్పటికీ... ఫైనల్‌ ఓటమి అందరినీ బాధకు గురి చేసింది. ఈ దెబ్బతో యావత్ దేశం నిరాశలో కూరుకుపోయింది. అయినప్పటికీ ఈ టోర్నీలో టీం ఇండియా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదిలా ఉంటే నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

అవును... నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్‌ పోటీలపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 1975లో ప్రారంభమైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌ ను వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. 1975 జూన్ 21న జరిగిన ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 60 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 291 పరుగులు సాధించింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసిస్... 58.4 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసిస్ పై 17 పరుగుల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్... తొలి ప్రపంచ కప్ ను ముద్దాడి రికార్డ్ సృష్టించింది. అయితే ఈ తొలి వరల్డ్‌ కప్‌ కు "ప్రుడెన్షియల్ వరల్డ్ కప్" అని నామకరణం చేశారు. కారణం... "ఫ్రుడెన్షియల్" అనే భీమా సంస్థ ఈ కప్‌ ను స్పాన్సర్‌ చేసింది.

ఆ తర్వాత జరిగిన ఆ తర్వాత 1979, 1983 ప్రపంచకప్ లో కూడా ఇదే బీమా కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ వరల్డ్‌ కప్‌ ట్రోఫీని వెండి, బంగారంతో రూపొందించారు. అనంతరం 1996 తర్వాత ఐసీసీ సరికొత్త ట్రోఫీని తయారు చేసింది. ఈ ట్రోఫీ తయారీ బాధ్యతను లండన్ లోని "గారార్డ్" అనే జ్యువెల్లరీ సంస్థకు అప్పగించింది ఐసీసీ. దీని తయారీకి సుమారు రెండు నెలల సమయం పడుతుందని చెబుతారు!

ఇక ఈ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ 60 సెంటీమీటర్లు ఎత్తు ఉండి.. ట్రోఫీపైన బంగారు రంగులో గ్లోబ్‌ కలిగి ఉంటుంది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ కు గుర్తుగా.. ఈ గ్లోబ్‌ క్రికెట్‌ బంతిని సూచిస్తుంది. ఈ గ్లోబ్‌ కు సపోర్ట్‌ గా మూడు సిల్వర్‌ కాలంస్ ఉంటాయి. ఇవి స్టంప్‌ లు, బెయిల్స్‌ ఆకారంలో నిలువుగా ఉంటాయి. ఏ కోణం నుంచి చూసిన ఒకేలా ఉండడం ఈ ట్రోఫీ మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఇక వెండి, బంగారంతో తయారు చేసే ఈ 11 కిలోల బరువున్న వరల్డ్ కప్ ట్రోపీ తయారీకి సుమారు రూ. 31 లక్షలు ఖర్చు అవుతుందట. ఇక ఈ వరల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టు పేరును ఆ ట్రోఫీ కింది భాగంలో ముద్రిస్తారు. గెలిచిన జట్టుకు ట్రోఫికి సంబంధించిన నకలును మాత్రమే అందిస్తారు. అసలు ట్రోఫీని ఐసీసీ దుబాయ్‌ లోని కార్యాలయంలో ఉంచుతుంది.

కాగా... ఇప్పటివరకూ 13 వరల్డ్ కప్ టోర్నీలు జరగ్గా... 1975, 1979లో వరుసగా రెండు సార్లు వెస్టిండీస్ గెలుచుకుంది. ఇక 1983లో తొలిసారి ఇటీవల 2011లో రెండోసారి టీం ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఇదే సమయంలో... 1987, 1999, 2003, 2007, 2015 లతోపాటు తాజాగా 2023తో కలిపి ఆరుసార్లు ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ సాధించుకుంది. ఈ క్రమంలో 1992లో పాకిస్థాన్, 1996లో శ్రీలంక, 2019లో ఇంగ్లాండ్ దేశాలు ఈ ప్రపంచకప్ ను ముద్దాడాయి.