Begin typing your search above and press return to search.

హర్యానాలో చెట్లకు రూ. 2,750 పెన్షన్

ప్రాణ్ వాయు దేవతా యోజన కింద 75 ఏళ్లకు పైగా వయసున్న చెట్లకు నెలకు ప్రభుత్వం రూ. 2,750 చెల్లించేందుకు రంగం సిద్ధం చేసింది

By:  Tupaki Desk   |   7 Dec 2023 1:30 AM GMT
హర్యానాలో చెట్లకు రూ. 2,750 పెన్షన్
X

చెట్లను మనం కాపాడితే అవే మనల్ని కాపాడతాయి. ఎలాంటి స్వార్థం లేని ప్రాణులు చెట్లు. దీంతో హర్యానా ప్రభుత్వం వాటిని కూడా ప్రాణులుగానే గుర్తిస్తోంది. వాటికి కూడా పెన్షన్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. ప్రాణ్ వాయు దేవతా యోజన కింద 75 ఏళ్లకు పైగా వయసున్న చెట్లకు నెలకు ప్రభుత్వం రూ. 2,750 చెల్లించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువరించింది. దీంతో చెట్లను కాపాడుకునే వారికి పంట పండనుంది.

తమ స్థలాల్లో ఉన్న చెట్ల సంరక్షణకు శ్రీకారం చుడుతున్నారు. వాటి నిర్వహణకు కట్టుబడుతున్నారు. అంత మొత్తంలో డబ్బులు రానుండటంతో చెట్ల మీద ప్రజలకు ప్రేమ పుట్టుకొస్తోంది. ఇది తమ చెట్టు అంటూ వాటిని సంరక్షించేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామపంచాయతీలు సైతం తమ ఆధీనంలో ఉన్న చెట్ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో చెట్లకు కూడా మహర్దశ పట్టనుందని పలువురు చెబుతున్నారు.

ఎవరి స్థలాల్లో చెట్లు ఉన్నా వారు నిరభ్యంతరంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. పాత చెట్లను జాగ్రత్తగా చూసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం. దీంతో చెట్ల సంరక్షణ బాధ్యతలు స్వీకరించడానికి పలువురు ముందుకు వస్తున్నారు. గ్రామపంచాయతీలు సైతం ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చెట్లను కంటికి రెప్పలా కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చెట్లకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ప్రభుత్వ ఆశయం గొప్పదని పలువురు పర్యావరణ ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాగైతే చెట్లను రక్షించడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తిస్తారని అంటున్నారు.

చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ పథకం ప్రకటించిన నాటి నుంచి గ్రామపంచాయతీలు, వ్యక్తులు చెట్లను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి చెట్లు ఎన్ని ఉన్నాయోననే దాని మీద సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లు, గ్రామపంచాయతీలు, ఇతర స్థలాల్లో ఉన్న చెట్లను గుర్తిస్తున్నారు. చెట్ల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరిలో ఆనందం వ్యక్తం అయ్యేలా చేస్తోంది.

చెట్లతో పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది. అందుకే ప్రభుత్వం చెట్ల కోసం పెన్షన్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ పథకంతో చెట్లకు మహర్దశ పట్టనుంది. చెట్లను కాపాడుకునే క్రమంలో అందరిని భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో భాగంగా చెట్ల సంరక్షణ చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భలే పసందుగా ఉందని చెబుతున్నారు.