Begin typing your search above and press return to search.

మోడీ మీద పోటీకి ట్రాన్స్ జెండర్...!

వారణాసి నుంచి ముచ్చటగా మూడవసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఆయన 2012లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు

By:  Tupaki Desk   |   9 April 2024 3:46 AM GMT
మోడీ మీద పోటీకి ట్రాన్స్ జెండర్...!
X

వారణాసి నుంచి ముచ్చటగా మూడవసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఆయన 2012లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటిదాకా ఆయన గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటూ వచ్చారు. 2014లో తొలిసారి ఆయన ప్రధాని అభ్యర్ధిగా వారణాసి నుంచి పోటీ చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టారు.

ఆ ఎన్నికల్లో ఆయన మీద అరవింద్ కేజ్రీవాల్ పోటీకి దిగారు. ఆయన మీద మోడీకి ఏకంగా 3,71,784 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. ఇక 2019 నాటికి ప్రధాని హోదాలో ఉంటూ మోడీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్ధిగా సమాజ్ వాది పార్టీ నుంచి షాలినీ యాదవ్ పోటీలో ఉన్నారు. ఈసారి. ఈసారి నరేంద్ర మోడీ మెజారిటీ ఏకంగా 4,79,505కి చేరుకుంది.

ఇక 2024లో అదే సీటు నుంచి మోడీ పోటీకి దిగుతున్నారు. ఆయన మీద పోటీకి కాంగ్రెస్ అజయ్ రాయ్ ని సిద్ధం చేసింది. ఇక ఇదే వారణాసి నుంచి హిందూ మహాసభ నుంచి హేమాంగి సఖి మాత పోటీ చేస్తూండడం అందరిలో ఆసక్తిని పెంచుక్తోంది. ఆమె ఒక ట్రాన్స్ జెండర్. అంతే కాదు ఆమె బరోడాలో జన్మించారు. ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం విశేషంగా చూస్తున్నారు. అలాగే ఆమె 2019లో ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిషిక్తులు అయ్యారు.

ఆమె హిందూత్వ భావాలు పుష్కలంగా కలిగి ఉన్నారు. ఆమె గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్నారు. అతి పురాతన ప్రాంతం ఆధ్యాత్మిక నిలయం అయిన వారణాసి నుంచి ఆమె పోటీ ఇపుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ఆమె పోటీతో హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకూ ఇబ్బంది అవుతుంది అన్న చర్చ సాగుతోంది.

ఇప్పటిదాకా రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ కానీ ఎస్పీ కానీ సెక్యూలర్ భావజాలంతో ముందుకు సాగిన వారు. దాంతో హిందూత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరం అయ్యేది. ఇపుడు హిందూ మహా సభ బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం అందులో హేమాంగి సఖి మాత వంటి వారు ముందుకు రావడం అంటే ఇపుడు అంతా ఆసక్తిగా దీనిని చూస్తున్నారు.

వారణాసిలో ప్రధాన ప్రత్యర్ధిగా కాంగ్రెస్ అభ్యర్ధి అతుల్ రాయ్ ఉన్నా హిందూ మహా సభ పోటీని కూడా తీసి పారేయటానికి లేదు అని అంటున్నారు. బీజేపీ భావజాలంతోనే హిందూ మహా సభ ఉన్నా ఎందుకు ప్రధాని మోడీ పైనే పోటీ పెడుతోంది అన్నది కూడా చర్చగా సాగుతోంది. బీజేపీ హిందూత్వ అజెండా రాజకీయ అజెండా అన్న కారణంతోనే పోటీకి దిగుతోందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఎవరీ హేమాంగ్ సఖి మాత అని నెటిజన్లు ఇపుడు ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోడీని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు. సో హేమాంగ్ సఖి మాత ఏ విధంగా తన ప్రచారాన్ని చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.