Begin typing your search above and press return to search.

ప్రీపెయిడ్.. పోస్టు పెయిడ్.. ఏదైనా ఇట్టే మారేలా కొత్త రూల్

పోస్టు పెయిడ్ లో సిమ్ ఉన్నోళ్లు.. ప్రీపెయిడ్ లోకి మారాలంటే అందుకు కూలింగ్ పిరియడ్ 90 రోజుల్లో మారే వీలుంది.

By:  Tupaki Desk   |   14 Jun 2025 6:00 AM
ప్రీపెయిడ్.. పోస్టు పెయిడ్.. ఏదైనా ఇట్టే మారేలా కొత్త రూల్
X

పోస్టు పెయిడ్ లో సిమ్ ఉన్నోళ్లు.. ప్రీపెయిడ్ లోకి మారాలంటే అందుకు కూలింగ్ పిరియడ్ 90 రోజుల్లో మారే వీలుంది. అయితే.. దీనికి పట్టే సమయం చాలా ఎక్కువ. అందుకు భిన్నంగా ఇట్లా కోరుకుంటే అలా మారిపోయేందుకు వీలుగా ట్రాయ్ కొత్త నిబంధనను తెర మీదకు తీసుకొచ్చారు. దీని ప్రకారం పోస్టు పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్.. అదే విధంగా ప్రీ పెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ కు మారటం కూడా సులువుగా మారనుంది. అంతేకాదు.. వినియోగదారులు తన అవసరాలకు అనుణంగా ప్లాన్ ను మార్చుకునే సదుపాయాన్ని తీసుకొచ్చారు.

2025 జూన్ 10న ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి.. ఇప్పటివరకు 90 రోజులుగా ఉన్న కూలింగ్ పీరియడ్ ను 30 రోజులకు తగ్గించారు. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో పోస్టు నుంచి ప్రీపెయిడ్ కు.. లేదంటే ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ కు మారిపోవచ్చు. తమకు తోచినట్లుగా ప్లాన్లు మార్చుకునే వెసులుబాటును కల్పించారు.

ఓటీపీ ఆధారిత కేవైసీ ద్వారా ఈ కొత్త సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుడు తాము సేవలు పొందుతున్న టెలికం ప్రొవైడర్ ఔటె లెట్ కు వెళ్లి.. ఓటీపీ ఆధారిత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక్కడో కీలకమైన అంశం ఉంది. అదేమంటే మొదటిసారి తమప్లాన్ మార్చుకోవాలనుకునే వారికి మాత్రమే ఈ సౌలభ్యం. అయితే.. ఒకసారి మారి.. మళ్లీ మార్చుకోవాలంటే మాత్రం 90 రోజుల వెయిట్ చేయక తప్పదు.