మేనల్లుడ్ని ముక్కలు చేసి సిమెంట్ తో పూడ్చేసింది
పశ్చిమ బెంగాల్ లోని దినాజ్ పుర్ జిల్లాకు చెందిన సద్దా నదాబ్ కాంట్రాక్టు కూలీగా పని చేస్తున్నాడు.
By: Tupaki Desk | 4 Jun 2025 9:58 AM ISTవివాహేతర సంబంధాలు చివరకు విషాద ఉదంతాలుగా మారుతుంటాయి. ఈ వాదనకు బలం చేకూరే దారుణ ఉదంతం ఒకటి పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది. మేనల్లుడ్ని కిరాతకంగా చంపేసిన దారుణం షాకింగ్ గా మారింది. అయితే.. దీనికి దారి తీసిన కారణాల్నిచూసినప్పుడు..
పశ్చిమ బెంగాల్ లోని దినాజ్ పుర్ జిల్లాకు చెందిన సద్దా నదాబ్ కాంట్రాక్టు కూలీగా పని చేస్తున్నాడు. గత నెలలో అతను కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సద్దా మిస్సింగ్ కేసును చేధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడికి వరుసకు అత్త అయిన మౌమితా హసన్ తో అతడికి సన్నిహిత సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు.
దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాల్ని సేకరించిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నాడు. తొలుత నోరు విప్పని ఆమె.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించటం మొదలు పెట్టగా.. అసలు విషయాన్ని చెప్పేసి అందరిని షాక్ కు గురి చేసింది. తన ప్రైవేటు ఫోటోల్ని బయటపెడతానంటూ నదాబ్ అదే పనిగా బెదిరిస్తుండటంతో తనను చంపేసినట్లుగా పోలీసుల ఎదుట ఒప్పుకుంది.
నదాబ్ ను చంపేసిన అనంతరం మూడు ముక్కలుగా చేసి.. తన ఇంట్లో సిమెంట్ తో పూడ్చేసినట్లుగా అంగీకరించింది. ఆమె ఇచ్చిన ఆధారాలతో ఆమె ఇంట్లోకి వెళ్లి తవ్వగా.. డెడ్ బాడీ ముక్కలుగా బయటపడింది. ఈ దారుణ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
