64-54.... వివాహేతర బంధం.. సిగ్గుపడిన వేళ!
మన దేశంలో వివాహేత బంధం కూడా చట్టబద్ధం అయిపోయిన విషయం తెలిసిందే. దీనికే చట్టం పరిభాషలో `సహజీవనం`.
By: Tupaki Desk | 13 April 2025 3:00 PM ISTమన దేశంలో వివాహేత బంధం కూడా చట్టబద్ధం అయిపోయిన విషయం తెలిసిందే. దీనికే చట్టం పరిభాషలో `సహజీవనం`. అయితే..ఇలాంటి వివాహేత బంధం కూడా సిగ్గు పడే ఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. వయసు, బాధ్యతలు, కుటుంబాలను కూడా విస్మరించి.. సంబంధంలో మునిగి తేలిన జంట.. చివరకు అఘాయిత్యానికి పాల్పడి.. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య అల్లాడుతున్నారు. వీరి కథ తెలిసిన వారు జాలి పడాల్సింది పోయి.. తిట్టిపోస్తున్నారు. మరి అలా ఉంది వీరి కథ!!
ఎక్కడ? ఎవరు?
బాపట్లకు చెందిన లక్ష్మీనారాయణకు 64 సంవత్సరాలు. రైల్వేలో పనిచేసి రిటైరయ్యారు. భార్య సహా పెళ్లి చేయాల్సి న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ పోషణ కోసం.. ఆయన ఓ చోట రైల్వే టికెట్ల బుకింగ్ కేంద్రాన్ని పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడకు వచ్చిన మాదవి అనే మహిళతో నారాయణకు పరిచయం ఏర్పడింది. పోనీ.. ఈమె వయసేమన్నా తక్కువా? అంటే.. కాదు.. ఈమెకు కూడా 54 ఏళ్ల వయసు.
అంతేకాదు.. ఈమెకు కూడా భర్త, పెళ్లి అయిన కుమార్తె, పెళ్లీడుకు వచ్చిన కొడుకు ఉన్నారు. అయితేనేం.. బుద్ధి కర్మానుసారిణి.. అన్నట్టుగా.. ఇరువురి మధ్య ప్రేమ చిగురించి.. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. వారానికి మూడు నుంచి నాలుగుసార్లు ఇరువురూ.. బయటకు వెళ్తున్నారని స్థానికులు తెలిపారు. ఇదిలావుంటే.. తాజాగా లక్ష్మీనారాయణతో ఒక రోజంతా ఉండాలని భావించిన మాధవికి అవకాశం రాలేదు.
ఇంతలో లక్ష్మీనారాయణ సతీమణి.. అరుణకు.. కంటి ఆపరేషన్ అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆమెను హైదరాబాద్‌కు తీసుకువెళ్లేందుకు ఆయన రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన ప్రేమికురాలు మాధవి.. నువ్వు ఇక్కడే ఉండు.. మనం మీ ఇంటికి వెళ్దాం.. ఆమెను పిల్లలతో కలిపి హైదరాబాద్‌కు పంపించు.. అని చెప్పింది. కానీ, ఎంతైనా కట్టుకున్న బంధం కదా.. అనుకున్నాడో ఏమో.. లక్ష్మీనారాయణ.. తన భార్యతో తానే వెళ్తానని.. ఆపరేషన్ చేయించి వస్తానని చెప్పాడు.
కానీ, మాధవి వినిపించుకోలేదు. అంతేకాదు.. హుటాహుటిన పెట్రోల్ డబ్బాతీసుకువచ్చి.. నారాయణపై పోసి.. తనపైనా పోసుకుని నిప్పంటించుకుంది. మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ విషయం వైరల్ గా మారడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లీడు కొచ్చిన పిల్లలను వదిలేసి ఇదేం పని! అని శాపనార్థాలు పెడుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
