Begin typing your search above and press return to search.

పది రోజుల్లో కొడుకు పెళ్లి తండ్రి హోటల్ గదిలో ఒక యువతితో.. కట్ చేస్తే చావు..

ఈ కథలో అసలైన విషాదం ఏంటంటే, సరిగ్గా మార్చి 12వ తేదీ ఆయన కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

By:  Tupaki Political Desk   |   1 March 2026 4:00 PM IST
పది రోజుల్లో కొడుకు పెళ్లి తండ్రి హోటల్ గదిలో ఒక యువతితో.. కట్ చేస్తే చావు..
X

జీవితం అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరనేది యథార్థం. కొన్నిసార్లు మనకు మనమే కొని తెచ్చుకునే కష్టాలు ప్రాణాల మీదకు వస్తుంటాయి. తాజాగా గురుగ్రామ్‌లోని ఒక హోటల్ గదిలో జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. 56 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి హోటల్‌కు వెళ్లాడు, అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటకు రాలేకపోయాడు. ఈ వార్త విన్న హోటల్ సిబ్బందితో పాటు ఆయన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

అసలు అక్కడ ఏం జరిగింది?

పోలీసులు వచ్చి గదిని పరిశీలించినప్పుడు అక్కడ కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ గదిలో సెక్స్ పవర్ పెంచే మందుల ఖాళీ ప్యాకెట్లు కనిపించాయి. ఆ వ్యక్తి ఒకేసారి ఎక్కువ మొత్తంలో (ఓవర్ డోస్) ఆ మాత్రలు వేసుకున్నాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఆయనకు గుండెపోటు వచ్చి మరణించినట్లు తేలింది. సాధారణంగా ఇలాంటి మందులు వాడినప్పుడు రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగి గుండె మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. పాపం, ఆయన కూడా ఆ మాత్రల ప్రభావం తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

కలిచివేస్తున్న విషయం

ఈ కథలో అసలైన విషాదం ఏంటంటే, సరిగ్గా మార్చి 12వ తేదీ ఆయన కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కొత్త జంటకు స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి వార్త వినాల్సి రావడం దారుణం! తండ్రి చనిపోయాడన్న బాధ కంటగే.. ఆయన ఒక మహిళతో కలిసి హోటల్ గదికి వెళ్లడం అదీ వివాహేతర సంబంధం అని బయటపడడం ఆ కుటుంబానికి తీరని అవమానాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఆ కుటుంబం అటు దుఃఖాన్ని, ఇటు తలవంపులను ఎలా భరించాలో అర్థం కాక సతమతమవుతోంది.

మనం నేర్చుకోవాల్సిన పాఠం

ఈ ఘటనను కేవలం ఒక దొంగచాటు వ్యవహారంగానో లేక ఒక ప్రమాదంగానో చూడలేం. ఆవేశపూరితమైన నిర్ణయాలు, తాత్కాలిక సుఖాల కోసం చేసే ప్రయత్నాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో ఈ కేసు ఒక హెచ్చరిక. వయసు మళ్లిన వారు తమ ఆరోగ్య పరిస్థితిని గమనించుకోకుండా, వైద్యుల సలహా లేకుండా ఇలాంటి శక్తివంతమైన మందులు వాడడం ప్రాణాంతకం అని వైద్యులు కూడా నెత్తీనోరు బాదుకుంటున్నారు.

ప్రస్తుతం పోలీసులు హోటల్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆ వ్యక్తితో ఉన్న మహిళను విచారిస్తున్నారు. చనిపోయే ముందు అసలు ఏం జరిగింది? ఎవరైనా బలవంతంగా ఆ మాత్రలు ఇచ్చారా? లేక ఆయనే సొంతంగా వేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఏది ఏమైనా, ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల ఒక మనిషి ప్రాణం పోవడమే కాకుండా, పెళ్లి జరగాల్సిన ఇంట్లో పాడె లేవడం గుండెను కలిచివేస్తోంది. ఇలాంటి ఘటనలు విన్నప్పుడైనా మనం మన ఆరోగ్యం పట్ల, చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది కదా!