Begin typing your search above and press return to search.

గెలుపు గ్యారంటీలదా? రేవంత్ దా?

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించ‌గా.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించింది

By:  Tupaki Desk   |   3 Dec 2023 3:30 PM GMT
గెలుపు గ్యారంటీలదా? రేవంత్ దా?
X

కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన గ్యారెంటీల అంశం ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం లో ఈ పార్టీ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ.. గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించారు.వాటికి త‌న హామీ అని చెప్పారు. ఇది తెలంగాణ‌లో వ‌ర్క్ అయింద‌ని అనుకున్నా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. ఛ‌త్తీస్‌గ‌డ్‌లో ఉన్న అధికారాన్ని పార్టీ కోల్పోయింది. ఇక‌, రాజ‌స్థాన్‌లోనూ ఇదే ప‌రిస్థితి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఒడిసి ప‌ట్టలేక పోయింది.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించ‌గా.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించింది. ఇక‌, రాజ‌స్థాన్‌లో 7 గ్యారెంటీలు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ 7 గ్యారెంటీలు ప్ర‌క‌టించి.. వాటిని అమ‌లు చేసే బాధ్య‌త‌ను తానే తీసుకుంటాన‌ని రాహుల్ చెప్పారు. కానీ, ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూస్తే.. ఈ గ్యారెంటీలు ఎక్క‌డా ప‌నిచేయ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి హ‌వా కార‌ణంగానే కాంగ్రెస్‌దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌ని.. చివ‌రి నిముషంలో కేసీఆర్‌కు ప్ర‌త్యామ్నాయంగా రేవంత్‌రెడ్డి ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్పించ‌గ‌లిగార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్లోనూ గ్యారెంటీలు ప‌నిచేయ‌లేదు. ఇత‌ర రెండు రాష్ట్రాల్లోనూ ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఒక‌వేళ‌.. తెలంగాణ‌లో గ్యారెంటీలు ప‌నిచేశాయ‌ని చెప్పుకొంటే.. ఆ రాష్ట్రాల సంగ‌తి అలా ఎందుకు మారింద‌నేది కూడా.. కాంగ్రెస్ ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. సో.. మొత్తానికి తెలంగాణ‌లో రేవంత్ ఫేస్ వాల్యూతోనే కాంగ్రెస్ గ‌ట్టెక్కింద‌నేది ప‌రిశీల‌కులు అంచ‌నా.

ఈ ఏడాది మేలో జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు ఇచ్చింది. కానీ, అక్క‌డ డీకే శివ‌కుమార్ చ‌క్రం తిప్ప‌డం.. నేనున్నానంటూ.. క‌న్న‌డిగుల‌కు ఆశ క‌ల్పించ‌డంతోనే అక్క‌డ పార్టీ గ‌ట్టెక్కింద‌నే అంచ‌నాలు అప్ప‌ట్లోనే వ‌చ్చాయి. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల ఫ‌లితాలు చెబుతున్న దానిని బ‌ట్టి.. బ‌ల‌మైన యువ నాయ‌కుల‌ను ఎంచుకోవాల్సిన అవ‌స‌రం కాంగ్రెస్‌కు ఉంద‌ని అంటున్ఆన‌రు.