Begin typing your search above and press return to search.

ఇండియాలోని టాప్ రెస్టారెంట్లలో ఏవి ఉన్నాయో తెలుసా?

సియోల్ లో జరిగిన వేడుకలో ఉత్తమ రెస్టారెంట్ల 12వ ఎడిషన్ జాబితా విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   28 March 2024 12:30 PM GMT
ఇండియాలోని టాప్ రెస్టారెంట్లలో ఏవి ఉన్నాయో తెలుసా?
X

ఇటీవల ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్లలో మన దేశం నుంచి మూడు ఎంపిక కావడం గమనార్హం. సియోల్ లో జరిగిన వేడుకలో ఉత్తమ రెస్టారెంట్ల 12వ ఎడిషన్ జాబితా విడుదల చేశారు. ఇందులో మన దేశం నుంచి మూడు రెస్టారెంట్లు ఉండటం గర్వకారణం. ఈ జాబితాలో టోక్యోలోని సజెన్, ఫ్లోరిలేజ్ రెస్టారెంట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోగా ముంబైలోని మాస్క్ రెస్టారెంట్ భారతదేశంలో అత్యుత్తమ రెస్టారెంట్ గా నిలిచింది.

మన దేశం నుంచి ఎంపికైన ఈ రెస్టారెంట్ 23వ స్థానం పొందింది. న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ 26వ స్థానంలో నిలిచింది. చెన్నైలోని అవర్తనా రెస్టారెంట్ 44వ స్థానంలో నిలవడం విశేషం. ముంబైలోని మాస్క్ రెస్టారెంట్ దేశంలో ఉత్తమ రెస్టారెంట్ గా ప్రకటించారు. దీనికి అదితి దుగర్, చెఫ్ వరుణ్ బోట్లానీ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. ఇందులో రూ. 4,583 నుంచి మెనూ ప్రారంభం అవుతుంది.

ఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ 2015 నుంచి 2021 వరకు దేశంలో ఉత్తమ రెస్టారెంట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2022లో జాబితా నుంచి తొలగిపోయి 2023లో 19వ స్థానంలో నిలిచింది. చెఫ్ మనీష్ మెహ్రోత్రాచే 2009లో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ వంటకాల ధర రూ. 4,167 నుంచి ప్రారంభం అవుతాయి. ఇలా ఈ రెస్టారెంట్లు ప్రజలకు ఎంతో పసందైనవిగా ఉంటున్నాయి.

చెన్నైకి చెందిన ఆవర్తనా రెస్టారెంట్ కొత్తగా అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశం నుంచి పలు వంటకాలతో ఈ రెస్టారెంట్ బెస్ట్ గా ఎంపిక కావడం మన సత్తా చాటుతోంది. టాప్ 50లో సింగపూర్ కు చెందిన రెస్టారెంట్లు 9 ఉన్నాయి. బ్యాంకాక్ లోని రెస్టారెంట్లు, హాంకాంగ్ లోని ఆరు రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. బీజింగ్ లోని ఒక రెస్టారెంట్ వన్ టు వాచ్ అవార్డును పొందింది.