Begin typing your search above and press return to search.

అమెరికాలో అతి స్వేచ్ఛ వల్ల జరుగుతున్న అనర్థాలివీ

అలా ప్రతి దేశానికి కొన్ని నియమ నిబందనలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   3 April 2024 7:10 AM GMT
అమెరికాలో అతి స్వేచ్ఛ వల్ల జరుగుతున్న అనర్థాలివీ
X

ప్రపంచంలో ఏ దేశానికైనా స్వేచ్ఛ ఉంటుంది. ఆ దేశ సార్వభౌమాదికార వినియోగంలో వారికి కొన్ని హక్కులు ఉన్నట్లే బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ దేశ కట్టుబాట్ల ప్రకారం అక్కడ పౌరులు విధులు నిర్వహించాల్సిందే. ఆ దేశ రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకోవాల్సిందే. లేకపోతే శిక్షార్హులు కావడం సహజమే. అలా ప్రతి దేశానికి కొన్ని నియమ నిబందనలు ఉంటాయి.

ప్రపంచంలో అగ్రదేశం అమెరికా. ఆ దేశం ఇతర దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. అది చెప్పిందే వేదం. అది పాటించేదే సత్యం. లేదంటే తన మాట వినని దేశాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. ప్రపంచ దేశాల అజమాయిషీలో తనే పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే నడుచుకుంటుంది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మద్య యుద్ధం జరుగుతోంది. ఇందులో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తోంది. హమాస్ ఉగ్రవాదులకు సాయం చేయాలని చూస్తోంది. దీన్ని ఎవరైనా సమ్మతిస్తారా? ఎంత అగ్రదేశమైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఏ దేశానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఉగ్రవాదులకు సాయం చేసే స్వేచ్ఛ అవసరం లేదు.

స్వేచ్ఛ అంటే విచ్చలవిడిగా ఉండకూడదు. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. తీవ్రవాదులకు సాయం చేయాలని అనుకోవడం అమెరికా కుట్రబాయి తనానికి పరాకాష్ట. ఏ దేశానికైనా సాయం చేస్తే దానికో అర్థం ఉండాలి. తీవ్రవాదులకు సాయం చేసే అధికారం అమెరికాకు లేదనే విషయం దానికి తెలియదా? కానీ ఎందుకు అలా చేస్తోంది.

అమెరికా చర్యలను సభ్య సమాజం ఖండిస్తోంది. ఏ దేశానికి అయినా సాయం చేస్తే ఆ దేశం గుర్తు చేసుకుంటుంది. కానీ తీవ్రవాదులకు సాయం చేస్తే దానికి అర్థం ఉండదు. వారు కసాయివారు. ఎవరినైనా హతమార్చే నైజం ఉన్నవారు. అలాంటి వారికి సాయం చేయాలనే అమెరికా కాంక్ష ముమ్మాటికి తప్పే. ఈ నేపథ్యంలో అమెరికా కుట్రలను అందరు ఖండిస్తున్నారు.