Begin typing your search above and press return to search.

అల్ట్రా స్టైల్ లో నభా సొగసుల మాయ!

టాలెంటెడ్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో మరోసారి స్టన్నింగ్ ఫోటోషూట్‌తో సందడి చేస్తోంది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 11:31 PM IST
అల్ట్రా స్టైల్ లో నభా సొగసుల మాయ!
X

టాలెంటెడ్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో మరోసారి స్టన్నింగ్ ఫోటోషూట్‌తో సందడి చేస్తోంది. ఎప్పుడూ ఎనర్జిటిక్ లుక్స్‌తో యువతను ఆకర్షించే ఈ బ్యూటీ.. తాజాగా కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఇచ్చిన స్టైలిష్ పోజులతో ఆకట్టుకుంటోంది. డార్క్ గ్రీన్ డ్రెస్, లాంగ్ బూట్స్‌తో కనిపించిన నభా.. కొరియన్ డ్రామాల్లో వచ్చే హీరోయిన్లను తలపించేలా ఈ లుక్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసింది. క్రేజీ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ ఫొటోలలో నభా చూపించిన యాటిట్యూడ్ అసాధారణం. ఎక్స్‌ప్రెషన్‌లో స్టైలిష్ ఎలివేషన్, హెయిర్ స్టైలింగ్, లైట్ మేకప్‌తో ఆమె అందాన్ని మరింతగా హైలైట్ చేశారు. కారు సీటులో కూర్చుని ఇచ్చిన స్టిల్‌లు, నిల్చున్న లుక్స్ అన్నీ కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలా ఫీలింగ్ ఇస్తున్నాయి. గ్లామర్‌ను ఓ రేంజ్‌లో ప్రెజెంట్ చేయడంలో నభా స్పెషలిటీ మరోసారి ఇక్కడ కనిపించింది.


నభా నటేష్‌కి మొదటి బ్రేక్ వచ్చిన చిత్రం ‘నన్ను దోచుకుందువ‌టే’. ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అనంతరం గ్లామర్ బ్యూటీగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే మళ్లీ వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో నటనలో కాస్త బ్రేక్ తీసుకుని తనను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది.


ఇటీవల ‘డార్లింగ్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో నటించి మళ్లీ గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకుంది. ఇకపోతే నభా ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే భారీ పీరియాడిక్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిఖిల్ సిద్దార్థ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభాకు ట్రెడిషనల్ గ్లామర్ రోల్ దక్కినట్లు టాక్.


ఇక సినిమా ఫస్ట్ లుక్‌లోనూ ఆమె లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి మాస్ సినిమాలూ, క్లాస్ ఫిల్మ్స్‌కి కంఫర్టబుల్‌గా ఒదిగిపోయే ఈ బ్యూటీ.. తాజాగా ఇచ్చిన ఫోటోషూట్‌తో మరోసారి యూత్‌ను మంత్రముగ్దం చేస్తోంది. ఇలానే వరుసగా ఇలా స్టన్నింగ్ లుక్స్‌తో నభా ఆకట్టుకుంటే.. మళ్లీ వరుసగా మంచి అవకాశాలు రావడం ఖాయం.