Begin typing your search above and press return to search.

సేమ్ సీన్ రిపీట్ : ఈ రోజు వైసీపీ....రేపు టీడీపీ...!?

అలా సీటు రాని వారు టికెట్ దక్కకుండా పోతున్న వారు వేరే పార్టీలలో చేరిపోతున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 3:30 AM GMT
సేమ్ సీన్ రిపీట్ : ఈ రోజు వైసీపీ....రేపు టీడీపీ...!?
X

కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. అలాగే ప్రతీ రాజకీయ పార్టీలో అలకలు అసంతృప్తులకు కాదేదీ విషయం అన్నదైతే ఉంది. ఈ రోజు వైసీపీలో అతి పెద్ద ఎక్సర్ సైజ్ సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నియోజకవర్గాలలో అభ్యర్ధులను మారుస్తున్నారు. అలా సీటు రాని వారు టికెట్ దక్కకుండా పోతున్న వారు వేరే పార్టీలలో చేరిపోతున్నారు.

అలా ఒక వేడి వాతావరణం వైసీపీలో ఉంది. దాన్ని చూసి టీడీపీ తమ్ముళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీలోని వారే బయటకు వచ్చి ఆ పార్టీ విషయాలు అన్నీ చెబుతున్నారని కూడా ఎకసెక్కమాడుతున్నారు. అయితే వైసీపీలో ఈ రోజు జరుగుతున్న భారీ కసరత్తులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి.

టికెట్ రాకపోతే ఎక్కడైనా ఒకటే విధంగా సౌండ్ ఉంటుంది. టికెట్ దక్కని వారు ఎక్కడైనా సైలెంట్ గా కూర్చోరు. ఎందుకంటే వారి మటుకు అది జీవన్మరణ సమస్య. తమకు రాజకీయ అస్తిత్వం దెబ్బ తింటుందని వారు భావించినపుడు అలాగే సౌండ్ చేస్తారు. కానీ ఇపుడు వైసీపీలో జరుగుతున్నది రేపటి రోజున టీడీపీలో కూడా జరగనుంది అని అంటున్నారు.

అదేలా అంటే వైసీపీలో అభ్యర్ధులను మార్చుతున్న ఆ వెనక బెంచ్ లో ఉన్న వారికి గతంలో టికెట్లు దక్కని వారికి బలంగా ఉన్న వారికి టికెట్లు ఇస్తోంది. పైగా సామాజిక న్యాయం కూడా చేస్తామని చెబుతోంది.ఎలా చూసుకున్నా వైసీపీలోని వారికే ఆ పార్టీ టికెట్లు ఇస్తోంది.

అందువల్ల ఎంత అసంతృప్తి ఉన్నా పార్టీ వారికే కదా టికెట్ అని సరిపెట్టుకోవాల్సి ఉంది. కానీ టీడీపీ వరకూ వస్తే అలా కాదు, పైగా అక్కడ పొత్తు పేరుతో బయట వారికి వేరే పార్టీల వారికి ఎవరెవరికో కచ్చితంగా ముప్పయి నుంచి నలభై దాకా సీట్లు పోయే చాన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే యాభై సీట్లు పోయినా పోతాయని అంటున్నారు.

ఇదే ఇపుడు టీడీపీలో చర్చగా ఉంది. వైసీపీలో లొల్లి చూసి ఇపుడు సంతోషిస్తున్న వారు రేపు టీడీపీలో మాట ఏమిటి అని కూడా అనుకుంటున్న నేపధ్యం ఉంది. దశాబ్దాల పాటు తాము పెంచి పోషించి బలోపేతం చేసుకున్న సీటుని పొత్తులో భాగంగా వేరే పార్టీకి ఇచ్చేయాలంటే త్యాగరాజులు కావాలీ అంటే ఎవరికైనా మనసొప్పదు అని అంటున్నారు.

ఇక ఎవరెవరికో టికెట్లు ఇచ్చి కేవలం ప్రచారం చేయమని వారి పెత్తనాన్ని భరించమని హై కమాండ్ చెబితే టీడీపీలో అయినా ఊరుకుంటారా అన్న చర్చ వస్తోంది. ఇప్పటికే జగ్గంపేట వంటి చోట్ల జనసేన టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఇదే సీన్ మరి కొన్ని చోట్ల కూడా జరగనుంది అని అంటున్నారు.

అందువల్ల టీడీపీ కూడా ఇలాంటివి ఫేస్ చేయాల్సిందే అంటున్నారు. అయితే ఈ విషయంలో జగనే బెటర్ గా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికలకు కరెక్ట్ గా తోంబై రోజుల టైం ఉండగానే జగన్ అభ్యర్ధుల ఎంపికకు తెర తీయడం ద్వారా ముందే ఏమైనా అసంతృప్తులు ఉంటే సరిచేసుకోవడం రిపేర్లకు కావాల్సిన టైం ఉంచుకుంటున్నారు అని అంటున్నారు.

అదే టీడీపీలో ఇలాంటి కసరత్తు ఎంత లేట్ గా మొదలెడితే అంత చేటు జరుగుతుందని అంటున్నారు. అది చివరికి చిచ్చు రేగితే పెరిగి పెద్దదైతే ఎన్నికల వేళ ఏమీ చేయడానికి కూడా ఉండదని అంటున్నారు. మొత్తానికి చూస్తే రెండే పార్టీలు ఉన్నాయి.

అటు నుంచి ఇటు రావాల్సిందే. దాంతో రాజకీయ ఆశావహులకు మాత్రం ఇబ్బంది అవుతోంది. అదే టైం లో చాలా మంది రేసులో ఉండడంతో పార్టీల అధినేతలకు కూడా బిగ్ ట్రబుల్ గా ఉంటోంది. సో ఇవాళ వైసీపీ రేపు టీడీపీ ఎన్నికల వేళ ఇలాటివి ఎన్నో సీన్లు చూడాల్సిందే అని అంటున్నారు