Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే రాజీనామాకు రెడీ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుకు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:50 AM GMT
వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే  రాజీనామాకు రెడీ?
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుకు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఇన్ ఛార్జ్ ల మార్పుతో అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక్కక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరి వారికి ఇతర పార్టీల నుంచి ఆహ్వానం అందిందా.. కన్ఫర్మేషన్ వచ్చిందా.. అక్కడ ప్లేస్ ఉందా అనే విషయాలపై మాత్రం స్పష్టంత రావడం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... జగన్ ఎక్కడ నుంచైతే వీరు గెలవడం సాధ్యం కాదని టిక్కెట్ ఇవ్వడం లేదో... ఇతర పార్టీలోకి వెళ్లే సమయంలో కూడా ఆ స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తుండటం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో తాజాగా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి పేరు తెరపైకి వచ్చింది! ఈయన కూడా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ ఊహాగాణాలు చక్కర్లు కొడుతున్నాయి.

అవును... మారుతున్న పరిణామాలు, సమీకరణలు, సర్వే రిపోర్టుల ప్రాతిపదికగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు కార్యక్రమంలో భాగంగా తిరువూరు అసెంబ్లీ టిక్కెట్టు.. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధికి రాదని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు ఈ విషయంపై ఒక క్లారిటీ ఉందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో రక్షణనిధి సెకండ్ థాట్ కి వెళ్తున్నారని తెలుస్తుంది.

తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం వైఎస్ జగన్ కన్ ఫాం చేసినట్లు తెలుస్తోంది. దీంతో... తిరువూరు నుంచి రెండు సార్లు గెలుపొందిన తనకు టికెట్ నిరాకరించడంపై రక్షణనిధి పక్కచూపులు చూస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా జిల్లాలోని మరో అసంతృప్త ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధితో ఈ విషయంపై రక్షణనిధి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తనకు తిరువూరు కాకుండా ఈసారి పామర్రు టిక్కెట్ ఇస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాబుకు సమాచారం పంపించారని తెలుస్తుంది.

అయితే 2019 ఎన్నికల్లో పామర్రు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఉప్పులేటి కల్పన ఈసారి కూడా పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క తిరువూరులో మాజీమంత్రి జవహార్ ఉండనే ఉన్నారని చెబుతున్నారు. దీంతో... రక్షణనిధికి సైకిల్ లో చోటుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది!