జనసేన ఎమ్మెల్యే ఆరణి వారి ఆపశోపాలు.. పని జరగట్లేదట..!
తిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న జనసేన నాయకుడు, మాజీ వైసీపీ నాయకుడు ఆరణి శ్రీనివాసులు ఆపశోపాలు పడుతున్నారు.
By: Tupaki Desk | 9 May 2025 3:30 PMతిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న జనసేన నాయకుడు, మాజీ వైసీపీ నాయకుడు ఆరణి శ్రీనివాసులు ఆపశోపాలు పడుతున్నారు. బలమైన సామాజిక వర్గం అండగా ఉన్నా.. ఆయన ఏ పనినీ సాధించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. బిళ్ల బంట్రోతును కూడా.. ఆయన బదిలీ చేయించలేక పోతున్నారన్నది గత నాలుగు రోజులుగా మీడియాలో వినిపిస్తున్న మాట. ఇదేసమయంలో పట్టు కూడా లేకుండా పోయిందన్న ది పార్టీలోనే జరుగుతున్న చర్చ.
మరి ఇలా ఎందుకు జరిగింది? ఎమ్మెల్యేగా ఎందుకు ఆయన మైనస్ అయ్యారు? అంటే.. ఆయన తప్పు కొని ఆయన అన్న కుమారుడు, ఆయన కుమారుడికి పగ్గాలు అప్పగించడమేనని పార్టీలో చర్చ నడుస్తోం ది. దీంతో వారు సంపాదనపైనే దృష్టి పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎంపీ ఒకరు.. అధికారులు సహా.. కలెక్టర్‌పై తన పట్టుబిగించేశారు. ఏం చేసినా.. తనకు చెప్పే చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో ఇప్పుడు తిరుపతిలో ఏం జరగాలన్నా.. ఓ ఎంపీ ప్రమేయం లేకుండా జరగడం లేదు.
ఇది ఆరణికి ఆపశోపాలు పెట్టిస్తోంది. ఇటీవల ఓ చిన్న బదిలీ వ్యవహారంపై ఆరణి సిఫారసు చేశారు. కానీ .. దీనిని ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేశారు. అదేవిధంగా తిరుమలలోనూ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదని కంగారు పడుతున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసి.. తిరుపతి ఎమ్మెల్యేగా విజయం దక్కిం చుకున్నా.. తనకు , తన మాటకు విలువ లేకుండా పోయిందని ఆరణి ఆవేదన చెందుతున్నారు. నిజానికి జనసేన తరఫున ఆయన అతి కష్టం మీద గట్టెక్కారు.
ఆరణికి టికెట్ ఇవ్వడాన్ని లోకల్ నాయకులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కిరణ్ రాయల్ కు టికె ట్ వస్తుందని అనుకున్నారు. కానీ, అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఆరణికే అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాల తాలూకు వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పైగా.. ఆయన ఆరోగ్య సమస్యల బూచి చూ పించి.. అప్రకటిత ఎమ్మెల్యేలుగా తన వారిని రంగంలోకి దింపారు. ఈ పరిణామాలన్నీ.. ఆరణికి శాపంగా మారి.. టీడీపీ ఎంపీకి అవకాశం ఇచ్చేలా చేశాయని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే.. ఆరణి మాట కేవలం ఇంట్లో వారే వింటున్నారట.. ఇదీ పరిస్థితి.