Begin typing your search above and press return to search.

'తిరుప‌తి' మేయ‌ర్ పీఠం అంత ఈజీకాదా ..!

తిరుమ‌ల శ్రీవారు కొలువైన తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో ఎన్నిక‌లు హాట్ హాట్‌గా సాగ‌నున్నాయా? ఓటు బ్యాంకు వ్య‌వ‌హారం ఇక్క‌డ కీల‌కంగా మార‌నుందా? అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే స‌మాధా న‌మే వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Oct 2026 8:00 PM IST
తిరుప‌తి మేయ‌ర్ పీఠం అంత ఈజీకాదా ..!
X

తిరుమ‌ల శ్రీవారు కొలువైన తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో ఎన్నిక‌లు హాట్ హాట్‌గా సాగ‌నున్నాయా? ఓటు బ్యాంకు వ్య‌వ‌హారం ఇక్క‌డ కీల‌కంగా మార‌నుందా? అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే స‌మాధా న‌మే వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. సీమ ప్రాంతంలోని కార్పొరేష‌న్ల‌లో ఎక్క‌డా లేని విధంగా తిరుప‌తి కార్పొరేష‌న్‌లో నే పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 12 మంది మేయ‌ర్ పీఠం కోసం పోటీలో ఉన్నారు. వీరిలోనూ ప్ర‌ధానంగా వైసీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ స‌క్సెస్ అయింది.

దీంతో కూట‌మి పార్టీల త‌ర‌ఫున పోటీలో ఉన్న అభ్య‌ర్థి గెలుపు ఇప్పుడు న‌ల్లేరుపై న‌డ‌క అయితే కాద‌న్న అభిప్రా యం వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి ఇత‌ర ప్రాంతాల్లో చాలా వ‌ర‌కు వైసీపీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను అధికారులు ప‌లు కార‌ణాల‌తో తిర‌స్క‌రించారు. కానీ, తిరుప‌తి విష‌యానికి వ‌స్తే.. వాసుదేవ్ యాద‌వ్ నామినేష‌న్ ను అనుమ‌తించారు. చిన్న‌పాటి వివాదాలు త‌లెత్తినా.. అధికారులు స‌ర్దుకుపోయారు. ఇక‌, ఈ సీటును కూట‌మి పార్టీల్లో టీడీపీకి కేటాయిం చారు. ఈ పార్టీ త‌ర‌ఫున మ‌న్నెం శ్రీనివాస ప్ర‌సాద్ బ‌రిలోకి దిగారు.

ఈయ‌న కాకుండా.. క‌మ్యూనిస్టులు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థి స‌హా.. స్వ‌తంత్ర అభ్య‌ర్తులు.. మొత్తంగా 12 మంది మేయ‌ర్ కోసం పోటీప‌డుతున్నారు. ఇక‌, నామినేష‌న్లు అన్నీ అధికారుల ఆమోదం పొందిన నేప‌థ్యంలో ఉప‌సంహ‌ర‌ణ వ్య‌వ హారం పెద్ద‌గా క‌లిసి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. దీంతో కీల‌క‌మైన స్థానంలో పోటీ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. కూట‌మి పార్టీల ఐక్య‌త‌తో పాటు తిరుప‌తి ఎంపీ, వైసీపీ నాయ‌కుడు గురుమూర్తి స‌హా భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి వంటి సీనియ ర్ల‌కు కూడా ఈ ఎన్నిక బిగ్ టెస్టుగానే మార‌నుంది.

స్థానికంపై ప‌ట్టు..

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కుటుంబానికి తిరుపతి స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారంపై మంచి ప‌ట్టుంది. గ‌తంలో విజ‌యం ద‌క్కించుకున్న అనుభ‌వంతోపాటు.. సానుభూతి కూడా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌చారం.. వైసీపీ అభ్య‌ర్థికి క‌లిసి రానుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, కూట‌మిలో స‌ఖ్య‌త ఇక్క‌డ కీల‌కంగా మార‌నుంది. అదేస‌మ‌యంలో తిరుమ‌ల, తిరుప‌తి ప్రాంతాల్లో ఇటీవ‌ల త‌లెత్తిన కొన్ని వివాదాలు కూడా ఇక్క‌డ ఎన్నిక‌ల్లో ప్ర‌చార అస్త్రాలుగా మార‌నున్నాయి. దీనికితోడు.. ఇండిపెండెంటు అభ్య‌ర్థులు ఏమేర‌కు ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేస్తార‌న్న విష‌యంపై కూడా ఎన్నిక‌ల్లో విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఏదేమైనా తిరుప‌తి స్థానం ఇప్పుడు వైసీపీ, టీడీపీల‌కు ప్ర‌తిష్టాత్మకంగా మారింద‌నే చెప్పాలి.