Begin typing your search above and press return to search.

ఆ నెయ్యిలో జంతుకొవ్వు.. కొత్త వాదన విన్నారా?

తిరుమల తిరుపతి శ్రీవారికి ప్రసాదంగా పెట్టే లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కల్తీ కలిసిందన్న విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది.

By:  Garuda Media   |   6 Feb 2026 11:41 AM IST
ఆ నెయ్యిలో జంతుకొవ్వు.. కొత్త వాదన విన్నారా?
X

తిరుమల తిరుపతి శ్రీవారికి ప్రసాదంగా పెట్టే లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కల్తీ కలిసిందన్న విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. కల్తీని పక్కన పెట్టి.. నెయ్యిలో జంతు కొవ్వు ఉందంటూ కూటమి నేతలు చేసిన విమర్శలపై వైసీపీ విరుచుకుపడుతోంది. ఆ నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు లేదని.. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరుగుతోంది. మరోవైపు.. నెయ్యి స్వచ్ఛమైనది కాదు కల్తీ అన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. జంతుకొవ్వు ఉందా? లేదా? అన్నది కూడా పాయింటేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

దీనికి ఏపీ అధికారపక్షం నెయ్యి కల్తీ మాత్రమే కాదు జంతుకొవ్వు కలిసింది. కావాలంటే.. మా దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. దీనికి భిన్నంగా విపక్ష వైసీపీ మాత్రం వాదనలు వినిపిస్తోంది. జంతుకొవ్వు కలవలేదంటూ వైసీపీ చేస్తున్న వాదనకు టీడీపీ వర్గాలు ఇప్పుడు సరికొత్త వాదనల్ని వినిపిస్తున్నారు. అంతేకాదు.. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి రెండు సంస్థల నుంచి రిపోర్టులు వచ్చాయని.. అందులో ఒకదాంట్లో జంతు కొవ్వు కలిసినట్లుగా స్పష్టం చేస్తుందని చెబుతుంటే.. మరో రిపోర్టును వైసీపీ హైలెట్ చేస్తూ.. కల్తీ మాటను ప్రస్తావించకుండా..జంతుకొవ్వు లేదన్న విషయం రిపోర్టులో ఉంది చూశారా? అని ప్రశ్నిస్తోంది.

దీనికి టీడీపీ వర్గీయుల నుంచి వస్తున్న మరో ఆసక్తికర వాదన ఏమంటే...జంతు కొవ్వు ప్రస్తావన లేకుండా ఎన్ డీఆర్ఐ ఇచ్చిన రిపోర్టు మీద సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. టీటీడీకి నెయ్యి కొనుగోల టెండర్ నిబంధనల్ని సడలించిన సమయంలో బోలేబాబా, దాని అనుబంధ డెయిరీల తనిఖీకి నియమించిన టీంలో ఎన్ డీఆర్ఐకు చెందిన ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉన్నారని.. అప్పట్లో అంతా ఓకే అని చెప్పేసి.. ఇప్పుడు అందుకు భిన్నంగా రిపోర్టు ఎలా ఇస్తారన్న కొత్త వాదనను వినిపిస్తున్నారు.

ఇక.. కూటమి ప్రభుత్వం మొదట్నించి వినినిస్తున్న జంతుకొవ్వు లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో కలిసిందనటానికి బలమైన వాదనను వినిపిస్తున్నారు. ఆ వానను పాయింట్ల మాదిరి చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుందని చెబుతున్నారు. వారి వాదన ఏమంటే..

- స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఎస్‌-వాల్యూ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాలి. అంతకుమించితే... జంతువుల కొవ్వులు కలిపి కల్తీ చేసినట్లే. ఈ విషయాన్ని ఎవరో కాదు.. గూగుల్ చేసినా తెలిసిపోతుంది.

- నెయ్యి పేరుతో టీటీడీకి సరఫరా చేసిన రసాయన మిశ్రమంలో ఎన్ వాల్యూ 117 వచ్చిందని ఎన్ డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. అంటే.. అందులో ల్యార్డ్ కలిసినట్లు. ల్యార్డ్ అంటే పంది కొవ్వు.

- ‘నెయ్యే కాని ఆ నెయ్యి’లో జంతువుల కొవ్వులూ కలిశాయి’ అంటూ పాడిపరిశ్రమకు చెందిన అత్యున్నత నియంత్రణ సంస్థ ఎన్ డీడీబీ - కాఫ్ ప్రయోగశాల తేల్చింది.

- నెయ్యి కాని నెయ్యిలో బీటా సిటోస్టిరాల్, లారిక్ యాసిడ్, లిగ్నోసెరిక్ యాసిడ్ లాంటివి పరిమితికి మించి ఉన్నాయి ఆవునెయ్యి స్వచ్ఛతను ఎస్ వాల్యూ ఆధారంగా గుర్తిస్తారు. ఎస్ వాల్యూ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాలి. కానీ.. టీటీడీకి సరఫరా చేసిన ఆయిల్ లో ఏకంగా 117.15 ఉందని గుర్తించారు. ఈ విషయాన్ని సీఎఫ్ టీఆర్ఐతో పాటు ఎన్ డీడీబీ ప్రయోగ శాలల్లో పరీక్షించి.. కల్తీ జరిగిందని నిర్దారించారు.

- అయితే.. సిట్ ఈ శాంపళ్లను హర్యానాలోని ఎన్ డీఆర్ఐకు పంపింది. ఆ సంస్థ అటూ ఇటూ తేల్చకుండా రిపోర్టు ఇవ్వటంతో.. విపక్షం ఆ రిపోర్టును చూపిస్తుంటే.. అధికారపక్షం మాత్రం సీఎఫ్ టీఆర్ఐతో పాటు ఎన్ డీడీబీ రిపోర్టులను చూపిస్తూ తన వాదనల్ని వినిపిస్తోంది.