టైర్ల శ్మశాన వాటిక.. ఇక్కడ 6 కోట్ల టైర్లు ఎందుకు పోగు చేశారో తెలుసా ?
ప్రపంచంలో ఒక నగరం సహజ వాయువు,చమురు నిల్వలతో పాపులర్ అయింది.
By: Tupaki Desk | 1 May 2025 4:53 AMఒక వాహనానికి టైర్లు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చక్రాన్ని కనుగొన్న సమయంలో అది నేటి కాలంలో ప్రజలకు ఇప్పుడు అంత ఉపయోగంగా ఉంటుంది బహుశా ఊహించి ఉండకపోవచ్చచు. నేడు ఆ చక్రం కారణంగానే ప్రపంచంలో వాహనాలు ఇటు అటు తిరుగుతున్నాయి. కానీ ప్రపంచంలో ఒక నగరం ఉంది..దానిని టైర్ల శ్మశాన వాటిక అనికూడా అంటారు. దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
టైర్ల స్మశాన వాటిక అంటే ఏమిటి?
ప్రపంచంలో ఒక నగరం సహజ వాయువు,చమురు నిల్వలతో పాపులర్ అయింది. కానీ ఇది ప్రపంచంలో మరో కారణంతో కూడా గుర్తింపు పొందింది. దానినే టైర్ల శ్మశాన వాటిక అని అంటారు. కువైట్ ఉత్తర దిక్కున సులైబియా టైర్ గ్రేవ్‌యార్డ్ ఉంది. దేశంలోని పనికిరాని టైర్లన్నింటినీ అక్కడే పడేసేవారు. దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ టైర్లు తెస్తున్నారు. దీని వల్లే 2012 నుండి 2020 మధ్య ఈ ప్రదేశంలో మూడుసార్లు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ఎన్ని టైర్ల కుప్ప ఉంది?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కువైట్‌లో ప్రతేడాది లక్షల సంఖ్యలో టైర్లు మారుస్తారు. అందుకే వాటిని ఈ ప్రదేశంలో పోగు చేస్తారు. అలాగే ప్రపంచం నలుమూలల నుండి కూడా ఇక్కడకు పెద్ద సంఖ్యలో టైర్లు వస్తాయి. ఒక నివేదిక ప్రకారం.. కువైట్‌లో ఆరు కోట్ల కంటే ఎక్కువ టైర్ల కుప్ప ఉంది. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ డంపింగ్ ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ అల్-సులైబియా, అల్-జహర్‌లో టైర్ల పెద్ద కొండలను చూడవచ్చు. టైర్లను సరిగ్గా పారవేయకపోవడం వల్ల వాటిని బహిరంగంగా వదిలివేస్తారు.
భూమిపై నరకం అని ఎందుకు అంటారు?
కువైట్‌లో టైర్ల రీసైక్లింగ్ వ్యవస్థ లేదు. కానీ కొన్ని దేశాలలో టైర్లను రీసైకిల్ చేసి కొత్త పదార్థాలను తయారు చేస్తారు.. కానీ కువైట్‌లో ఈ వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం టైర్లను సరిగ్గా పారవేయడంపై కఠినంగా వ్యవహరించకపోవడంతో చాలా మంది వాటిని ఎడారిలో పడేస్తున్నారు. పాత టైర్లకు నిప్పంటుకోవడం వల్ల అక్కడి గాలి విషపూరితమవుతోంది. అందుకే దీన్ని భూమిపై నరకం అని కూడా అంటారు.