ఎలన్ మస్క్ కంటే ముందే ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్ ఇతడే!
స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ఐపివో కారణంగా ఎలన్ మస్క్ మొట్టమొదటి ట్రిలియనీర్ గా అవతరించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 16 Jun 2026 9:00 AM ISTస్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ఐపివో కారణంగా ఎలన్ మస్క్ మొట్టమొదటి ట్రిలియనీర్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే అతడు రూపొందించే ప్రతి ప్రాజెక్ట్ తన ఎదుగుదలకు సంబంధించిన ఒక కమర్షియల్ ప్రాజెక్ట్. కానీ మస్క్ తో పోలిస్తే ధాతృత్వంలో గొప్ప వ్యక్తిగా గుర్తింపు ఉన్న సర్ టిమ్ బెర్నర్ లీ మొట్టమొదటి ట్రిలియనీర్ గా అవతరించి ఉండేవారని విశ్లేషిస్తున్నారు. ఆయన దాన గుణం కారణంగా మాత్రమే ట్రిలియనీర్ కాలేకపోయారు కానీ, ఆరోజుల్లోనే ఆయన ఈ ప్రపంచానికి వరల్డ్ వైడ్ వెబ్ (WWW)ను సృష్టించి ఉచితంగా అంకితమివ్వకపోయి ఉంటే, ఆయన సంపాదన ట్రిలియన్ డాలర్లను దాటిపోయేదని విశ్లేషిస్తున్నారు. అతడి క్రియేషన్ కి స్వల్ప రుసుము వసూలు చేయాలని భావించినా, ప్రపంచ జనాభా నుంచి ఎంత పెద్ద మొత్తం వసూలయ్యేదే ఊహించలేనిది. తన స్వార్థానికి ఆలోచిస్తే అతడు మొట్టమొదటి ట్రిలియనీర్ గా సంచలనాలు సృష్టించేవాడు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా అతడికి చెల్లింపులు చేయాల్సి వచ్చేది. దీనిని బట్టి టిమ్ త్యాగం గురించి
టిమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదించిన వెబ్ అసలు ఆశయం చాలా స్పష్టమైనది. అది అందరి కోసం.. అన్ని విషయాలతో నిండి ఉంటూ... పూర్తిగా ఉచితంగా ఉండాలి అనే నిస్వార్థమైన ఆలోచన. నేడు దాదాపు 5.5 బిలియన్ల మంది ప్రజలు నిత్యం దీనిని ఉపయోగిస్తున్నా.. ఇది ఆయన ఊహించిన ప్రజాస్వామ్య -స్వేచ్ఛా స్వరూపానికి పూర్తి భిన్నంగా తయారైంది. ఇటీవల ఆయన రాసిన `దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్` అనే పుస్తక ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ... తాను ఎంతో ఉత్సాహంతో సృష్టించిన వెబ్‌ను కాపాడుకోవడానికి టెక్ యాక్టివిస్టులు, డెవలపర్లతో కలిసి ఒక కొత్త తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. మనం ఇంటర్నెట్‌ను మళ్లీ బాగు చేయగలం.. ఇంకా సమయం మించిపోలేదు! అని పేర్కొంటూ.. దీనిని ఆయన `వెబ్ ఆత్మను కాపాడే యుద్ధం`గా అభివర్ణించారు.
టెక్నాలజీ అనేది ఎప్పుడూ తటస్థంగా ఉండదని నమ్మే బెర్నర్స్ లీ, వెబ్ పతనం 1990లలో డొమైన్ నేమ్ సిస్టమ్ (ముఖ్యంగా .com స్పేస్) వాణిజ్యీకరణతోనే ప్రారంభమైందని గుర్తించారు. అమెరికన్లు లాభాపేక్షతో విద్యాసంబంధమైన ఈ వేదికను పూర్తి కమర్షియల్ హబ్‌గా మార్చేయడం ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత లాభాల వేటే ఇంటర్నెట్ రూపకల్పనను శాసించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా 2016 నాటి అమెరికా ఎన్నికల సమయంలో వెబ్ ఏ స్థాయిలో విషపూరితంగా మారుతుందో ఆయనకు ప్రత్యక్షంగా అర్థమైంది. ఆన్‌లైన్ దుర్వినియోగం... డేటా లీకులు ... వినియోగదారుల ప్రవర్తనను మార్చే కుట్రలను చూసి 2018 నాటికల్లా తాను తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురయ్యానని లెజెండరీ టిమ్ బహిరంగంగానే వెల్లడించారు.
బెర్నర్స్ లీ స్వయంగా ప్రచురించిన ఒక అంతర్జాల మ్యాప్ ప్రకారం... ఇంటర్నెట్‌లో జూమ్, ఈమెయిల్, సృజనాత్మకత వంటి ఎన్నో మంచి విషయాలు ఉన్నా.. దానిలోని ఒక చిన్న భాగం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలు వినియోగదారులను బానిసలుగా మార్చడానికి, సమాజాన్ని అంకితమయ్యేలా చేయడానికి.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి `అడిక్టివ్ అల్గారిథమ్స్`ను వాడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వేదికలు కేవలం లాభాల కోసం, నిఘా - ద్వేషాన్ని పెంచే విధంగా ఆప్టిమైజ్ చేసారని.. ప్రజలు వీటిపై ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక అనారోగ్యాలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తీవ్రమైన డిజిటల్ సంక్షోభం నుండి వెబ్‌ను రక్షించడానికి బెర్నర్స్ లీ ఇప్పుడు `సాలిడ్` అనే ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్నెట్‌లో వికేంద్రీకరణను తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత డేటాపై కార్పొరేట్ కంపెనీలకు ఉన్న యాక్సెస్‌ను నియంత్రించి... పూర్తి హక్కులను తిరిగి పొందవచ్చు. వెబ్ అనేది కేవలం కొన్ని బిగ్ టెక్ కంపెనీల గుత్తాధిపత్యంలో ఉండే వ్యాపార ప్రకటనల వేదిక కాకుండా... ప్రతి ఒక్కరి స్వేచ్ఛకు.. సృజనాత్మకతకు .. ప్రజాస్వామ్య విలువలకు నిజమైన ప్రతీకగా నిలవాలన్నదే ఆయన అంతిమ లక్ష్యం. కోట్లాది రూపాయల సంపదను వదులుకుని.. ఇప్పుడు సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న ఈ ద్వితీయ ప్రయత్నం నిజంగా స్ఫూర్తిదాయకం.
