Begin typing your search above and press return to search.

స్వీయ వివాహం చేసుకున్న 26 ఏళ్ల యువతి ఆత్మహత్య... కారణం?

గత ఏడాదిలో కుబ్రా ఐకుట్ (26) స్వీయ వివాహం చేసుకుని సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sept 2024 11:24 AM IST
స్వీయ వివాహం  చేసుకున్న 26 ఏళ్ల యువతి ఆత్మహత్య... కారణం?
X

గత ఏడాదిలో కుబ్రా ఐకుట్ (26) స్వీయ వివాహం చేసుకుని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక్కసారిగా నెటిజన్ల దృష్టి ఆమెపై పడింది. తెల్లని గౌనులో మెరిసిపోతూ ఉన్న ఫోటోలు పంచుకున్న ఆమె తాను స్వీయ వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఆమె ఆత్మహత్య చేసుకుంది.


అవును... తనకు తగిన తోడు దొరకలేదని చెబుతూ వరుడు లేకుండా తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కుబ్రా ఐకుట్ ఆత్మహత్య చేసుకుంది. ఓ లగ్జరీ అపార్ట్మెంట్ లో ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ నుంచి కిందపడి దుర్మరణం చెందింది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాశం అవుతుంది.

ప్రధానంగా స్వీయ వివాహంతో తుర్కియేలో అపార ఫాలోయింగ్ సంపాదించుకున్న కుబ్రా ఆత్మహత్య చేసుకుందనే వార్త ఆమె అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అంటున్నారు. అయితే.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు.

ఇదే సమయంలో ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారని అంటున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు టిక్ టాక్ లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. శక్తినంత కూడదూసుకున్నా బరువు పెరగట్లేదు.. ప్రతీ రోజూ ఒక కిలో చొప్పున బరువు దగ్గిపోతున్నాను.. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.. అని ఆమె చివరిగా పొస్ట్ పెట్టింది.

అయితే.. ఆమె మరణవార్త విన్న అభిమానులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయినట్లు చెబుతున్నారు. ఆన్ లైన్ వేదికగా ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. మంచి మనసున్న దేవ కన్య అంటూ ఆమెను కీర్తించారు. ఇక, ఆమె అంత్యక్రియలను స్వగ్రామంలో ఏర్పాటు చేశారు. ఇందులో అభిమానులతోపాటు సాటి ఇన్ ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు.