Begin typing your search above and press return to search.

పాలేరు సీటు తుమ్మలకేనా... షర్మిల ఏపీకేనా...?

ఆయన చూపు పాలేరు సీటు మీద ఉందని అంటున్నారు. ఆయనకు ఆ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉందని అంటున్నారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 3:51 AM GMT
పాలేరు సీటు తుమ్మలకేనా... షర్మిల ఏపీకేనా...?
X

వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు పాలేరు సీటుకు లింక్ ఉంది. తెలంగాణాలో రాజకీయాలు చేయడానికి వైఎస్ షర్మిల ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే హై కమాండ్ మాత్రం ఏపీలోనే ఆమెను ఫోకస్ పెట్టమని చెబుతోంది. ఇలా చర్చలు జరిగినా వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ నిలిచిపోయింది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణా రాజకీయాలలో చాలా పరిణామాలు చకచకా జరిగిపోయాయి. బిగ్ షాట్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీయారెస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి మార్గం సుగమం అవుతోంది అని అంటున్నారు. తుమ్మల వస్తే కనుక ఆయనకు ఖమ్మం జిల్లాలో కోరుకున్న సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. ఎందుకంటే అంగబలం అర్ధబలం ఉన్న వారు ఈ మాజీ మంత్రి.

ఆయన చూపు పాలేరు సీటు మీద ఉందని అంటున్నారు. ఆయనకు ఆ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉందని అంటున్నారు. మరి అదే సీటు మీద ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేయాలని వైఎస్ షర్మిల చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఇపుడు ఆమె పార్టీ విలీనం ఉంటుందా ఉన్నా పాలేరు సీటు నుంచి పోటీ డిమాండ్ నెరవేరుతుందా అన్నది ఇపుడు చర్చగా ఉంది.

ఈ పరిణామాల నేపధ్యంలో సడెన్ గా షర్మిల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఆమె గన్ మాన్ లేకుండా తన కుటుంబంతో కలసి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ఈసారి ఆమె కాంగ్రెస్ అధినాయకత్వం ముందు తన ప్రతిపాదనలు ఉంచుతారని అంటున్నారు. వాటికి కనుక తగిన రెస్పాన్స్ వస్తే ఆమె స్వయంగా కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసే విషయాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ ఇపుడు తెలంగాణాలో బోలెడంత డిమాండ్ వచ్చి పడుతోంది. ఒక వైపు ముందుగానే బీయారెస్ టికెట్లు అనౌన్స్ చేయడంతో అక్కడ ఆశావహులు వస్తున్నారు. అలాగే ఇతర పార్టీలలో ఉన్న వారు గెలుపు గుర్రం అని భావించి కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నారు.

దీంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా షర్మిలను ఏపీ రాజకీయాల్లోనే ఉండమని చెబుతారా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా వైఎస్ షర్మిల పార్టీ విలీనానికి పాలేరు సీటుకు మధ్య లింక్ ఏర్పడిపోయింది. పాలేరు సీటు ఇవ్వకపోయినా పార్టీ విలీనం చేస్తే మాత్రం షర్మిల రాజకీయం ఏపీకి షిఫ్ట్ అయినట్లుగానే భావించాలని అంటున్నారు. చూడాలి మరి ఒకటి రెండు రోజులలోనే దీని మీద కొత్త పరిణామాలు బయటకు వస్తాయని అంటున్నారు.