Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు దక్కనున్నాయా?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 6:06 AM GMT
ఆ ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు దక్కనున్నాయా?
X

పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందిన విజయంతో జోష్ మీదుంది. దీంతో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్ చార్జిలను నియమించి ముందుకు వెళ్తోంది. ఇక్కడ నుంచి గట్టి పట్టు సాధించాలని భావిస్తోంది.

17 ఎంపీ స్థానాల్లో మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించింది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కరిని ఇన్ చార్జిలుగా చేసింది. ఇందులో ఇద్దరిని మాత్రం మంత్రులు కాని వారిని ఇన్ చార్జిలుగా నియామకం చేసింది. వారు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. ఈ ఇద్దరికి త్వరలో మంత్రి పదవులు దక్కడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించలేదు. సుదర్శన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నారు.

జీవన్ రెడ్డికి నిజామాబాద్, సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. అందరు మంత్రులకు పార్లమెంట్ స్థానాలు ఇన్ చార్జిలుగా నియమించారు. వీరిద్దరికి మాత్రం మంత్రులు కాకున్నా పార్లమెంట్ స్థానాలు ఇన్ చార్జిలుగా కేటాయించడంతో వారికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈనేపథ్యంలో వీరికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 12 మందిని మంత్రులుగా నియమించారు. ఒక్కొక్కరికి రెండేసి శాఖలు కేటాయించారు. ఇంకా 12 మందికి చోటు దక్కనుందని సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఇంకా కొందరికి మంత్రులుగా నియమిస్తారనే టాక్ వస్తోంది. దీంతో మంత్రివర్గంలోకి ఇంకా ఎవరెవరిని తీసుకుంటారనే విషయంలో స్పష్టత లేదు. 9 మంది మంత్రులకు ఒక్కో నియోజకవర్గం కేటాయించగా ఇద్దరికి మాత్రం రెండు నియోజకవర్గాలు ఇచ్చారు.

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలకు బెర్త్ ఖాయమని చెబుతున్నారు. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. ఎమ్మెల్యేగా గెలిస్తే మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కేది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండటంతో ఆయనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో అందరికి పదవులు సమానంగా ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.