Begin typing your search above and press return to search.

నెటిజన్ విశ్లేషణ.. కేటీఆర్ ట్వీట్ కు కాంగ్రెస్ నేతల కౌంటర్ ఇదే

కేటీఆర్ మాట్లాడేకొద్దీ.. మరింత నష్టం వాటిల్లుతుందన్న అంచనాకు తగ్గట్లే ఎన్నికల ఫలితాలు వెలువడటం గమనార్హం.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:26 AM GMT
నెటిజన్ విశ్లేషణ.. కేటీఆర్ ట్వీట్ కు కాంగ్రెస్ నేతల కౌంటర్ ఇదే
X

టైం బాగోకపోతే అంతే. ఏం చేసినా రివర్సు అవుతుంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అప్పటి మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలన్ని రివర్సు కొట్టేయటమే కాదు..ఆయన ఎత్తుగడలన్ని అడ్డంగా బుక్ అయ్యేలా చేశాయన్న విమర్శ బలంగా వినిపించింది. ఒక దశలో గులాబీ పార్టీ ముఖ్యనేతలు సైతం.. కేటీఆర్ మాట్లాడకుండా ఉంటే బాగుండదని ప్రార్థించటం కనిపించింది. కేటీఆర్ మాట్లాడేకొద్దీ.. మరింత నష్టం వాటిల్లుతుందన్న అంచనాకు తగ్గట్లే ఎన్నికల ఫలితాలు వెలువడటం గమనార్హం.

ఎన్నికల ఫలితాల్ని కేటీఆర్ తో పాటు.. గులాబీ పార్టీకి చెందిన ప్రముఖులు ఎవరూ అంచనా వేయలేని రీతిలో ఉన్నాయన్నది వారి రియాక్షన్ ను చూస్తే అర్థమయ్యే పరిస్థితి. అయితే.. వాస్తవాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే.. అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా అంటే.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా కేటీఆర్ అదే పనిగా రియాక్టు అవుతున్న విషయాలతో పార్టీకి నష్టమే తప్పించి లాభం జరగటం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ ఓటమిపై పలువురు పలు రకాల విశ్లేషణలు చేశారు. తాజాగాఅలాంటి వాటిల్లో తనకు బెస్టుగా అనిపించిన ఒక నెటిజన్ విశ్లేషణ గురించి కేటీఆర్ రియాక్టు కావటమే కాదు.. సదరు నెటిజన్ చేసిన విశ్లేషణను సమర్థిస్తారా? అంటూ ప్రశ్నను సంధించారు. ఇంతకూ కేటీఆర్ పోస్టు చేసిన సదరు నెటిజన్ చేసిన ట్వీట్ చూస్తే.. ‘తెలంగాణలో కేసీఆర్ 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు.. తమపై వచ్చిన అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ చానల్స్ పెడితే సరిపోయేది’ అంటూ పేర్కొన్నారు. దీనికి కేటీఆర్ జనాభిఫ్రాయాన్ని కోరారు.

కేటీఆర్ చేసిన తాజా ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు.. మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టులు తమ అంతర్గత సంభాషణల్లో ఆసక్తికరంగా మారాయి. పాపం సదరు నెటిజన్ కు తెలీదేమో.. ఎన్నికలకు ముందే పలు యూట్యూబ్ చానళ్లను గులాబీ పార్టీ సిద్ధం చేసుకుందన్న వాదనను వినిపిస్తున్నారు.అయినా.. సొంత పేపర్.. సొంత చానల్ తోపాటు పలు యూట్యూబ్ చానళ్లతో ముందే ఒప్పందం చేసుకున్న వైనం సగటు వ్యక్తులకు తెలిసే అవకాశం లేదంటున్నారు. అన్ని తెలిసిన కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం.. ఇలాంటి అంశాల్నిప్రస్తావనకు తెచ్చినప్పుడు మౌనంగా ఉంటే సరిపోతుందని.. అందుకు భిన్నంగా రియాక్టు అయితే పోయేది కేటీఆర్ గాలేనని వ్యాఖ్యానిస్తున్నారు.