Begin typing your search above and press return to search.

భార్యల దగ్గర ఏ విషయాలు దాచాలో తెలుసా?

భార్యాభర్తల సంబంధంలో భర్త కొన్ని విషయాలు భార్యకు చెప్పకుండా ఉంచడమే శ్రేయస్కరం. దీంతో మన సంసారానికి ఢోకా లేకుండా ఉంటుంది.

By:  Tupaki Desk   |   31 Dec 2023 1:30 AM GMT
భార్యల దగ్గర ఏ విషయాలు దాచాలో తెలుసా?
X

కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. ఆలుమగల బంధంలో అపార్థాలు, అనుమానాలు, రహస్యాలు ఉండకూడదంటారు. కానీ కొన్ని విషయాలు దాచడం వల్ల మనకు మేలు కలుగుతుందని గ్రహించుకోవాలి. లేకపోతే సంసారంలో కలతలు రావచ్చు. కాపురం చెల్లాచెదురయ్యే వీలుంటుంది. ఈ విషయం తెలుసుకుని మసలుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులు ఏర్పడటం ఖాయం.

భార్యాభర్తల సంబంధంలో భర్త కొన్ని విషయాలు భార్యకు చెప్పకుండా ఉంచడమే శ్రేయస్కరం. దీంతో మన సంసారానికి ఢోకా లేకుండా ఉంటుంది. పొరపాటున మన రహస్యాలు చెబితే మన మనుగడకే ప్రమాదం పొంచి ఉంటుంది. మన బలహీనతను జీవితభాగస్వామికి చెప్పొద్దు. అలా చెబితే ఏదో ఒక సందర్భంలో మీకు వ్యతిరేకంగా ఆ విషయాన్ని ప్రయోగించి విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

మనకు జరిగే అవమానం గురించి కూడా జీవిత భాగస్వామి దగ్గర చెప్పకూడదు. అలా చెబితే భవిష్యత్ లో ఆమె గుర్తు చేసి మరీ మన గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం కలుగుతుంది. అందుకే మనకు జరిగిన అవమానం గురించి అప్పుడే మరిచిపోవాలి. లేకపోతే మన గురించి అన్ని విషయాలు తెలిస్తే జీవిత భాగస్వామి మనకు భయపడదు. పైగా మనల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.

ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి కూడా తెలియొద్దంటారు. మనం చేసే దానాలు ఎప్పుడు కూడా భార్యకు తెలియకుండా జాగ్రత్తలు వహించాలి. మీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నప్పుడు ఈ విషయం ప్రస్తావించి మన బలహీనత మీద దెబ్బ కొడుతుంది. ఇలా జీవితభాగస్వామికి చెప్పకుండా దాచాల్సిన విషయాలు ఉంటాయని తెలుసుకోవాలి.

మనం సంపాదించే సంపాదన గురించి కూడా భార్యకు వివరించడం సబబు కాదు. అలా చేయడం వల్ల మన వ్యక్తిగత అవసరాలు తీరవు. ఎందుకంటే మనకొచ్చే జీతం కరెక్టుగా తెలిస్తే ఆమె దానికి తగిన ఖర్చులు లెక్కలు వేస్తుంది. దీంతో మనం పర్సనల్ గా పెట్టుకోవాల్సిన ఖర్చుల మీద ప్రభావం పడుతుంది. ఇలా భార్యల ముందు మనం కొన్ని విషయాలు దాచితేనే మనకు నష్టం లేకుండా ఉంటుంది.