Begin typing your search above and press return to search.

ఈ "పండ్ల గ్రామం" లక్షాధికారుల పల్లె... ఎందుకో తెలుసా?

మరి వీరిలో ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది దాదాపు అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 April 2024 12:30 AM GMT
ఈ పండ్ల గ్రామం లక్షాధికారుల పల్లె... ఎందుకో తెలుసా?
X

"రైతే రాజు" నిత్యం వినే మాటే ఇది! ఈ స్వతంత్ర భారతంలో జై జవాన్, జై కిసాన్ అనే మాటలు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. మరి వీరిలో ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది దాదాపు అందరికీ తెలిసిందే. అప్పులు బాద తాలలేని రాచరికం రైతుదైతే.. జవాన్ మృతి చెందితే పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ కుటుంబ సభ్యులు తిరిగే పరిస్థితులు కూడా దర్శనమిస్తుంటాయి! ఆ సంగతి అలా ఉంటే... రెగ్యులర్ గా వినే మాటలకు భిన్నంగా ఒక ఊరిలో నిజంగానే రైతు రాజుగా బ్రతుకుతున్నాడు! వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది అక్షరాలా నిజం!

అవును... మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ధుమల్‌ వాడీ అనే ఊరిలో కూడా తొలుత కష్టనష్టాలను ఓర్చే రాచరికాన్నే అక్కడి రైతులు కూడా అనుభవించేవారు! ఒకప్పుడు పంటలు పండక రైతులే కూలీలుగా మారిపోయిన పరిస్థితి. అయితే అనూహ్యంగా ఆ ఊరి పెద్దలు, రైతులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సంప్రదించి భూసారాన్ని పెంచుకునే మార్గాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ ఊరికి పక్కనున్న ఇరవై గ్రామలా నుంచి వలస కూలీలు వస్తున్నారంటే ఆశ్చర్యనిమించక మానదు!

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ధుమల్‌ వాడీ అనే ఊరిలో కొన్నేళ్ల క్రితం మినుములూ, గోధుమలూ, జొన్నలూ సాగు చేసేవారు. అయితే... నీటివనరులు పుష్కలంగా ఉన్నా భూసారం లేకపోవడంతో పంటలు సరిగా పండేవికావు. మరోవైపు పంటలకు సరైన ధర లేక రైతులు నష్టపోయేవారు. గ్రామపెద్దలు అంతా కలిసి ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలని వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సంప్రదించారు. ఈ సమయంలో పండ్లతోటలకి తమ వాతావరణం అనుకూలమైందని తెలుసుకున్నారు.

ఈ సమయంలో కొందరు మాత్రం ఈ పండ్ల తోటలు వేయడానికి ముందుకొచ్చారు. కారణం... ఒక రకం పంట వేస్తే ఒకే సీజన్‌ కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఊరంతా ఏకమైంది. గ్రామస్థులు తమకున్న వెయ్యి ఎకరాల్లో ఇరవై రకాల పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. మామిడి, సపోటా, దానిమ్మ, అరటి, సీతాఫలం, అంజీర, నారింజ, డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, జామ, నిమ్మ, ద్రాక్ష, ఉసిరి, పనస తదితర తోటలను పెంచుకుంటూ ప్రతి సీజన్‌ లోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఫలితంగా ఏడాది తిరిగే సరికి దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు రైతులు! ఈ క్రమంలో ఆ గ్రామలో పొలం ఉన్న రైతుల పరిస్థితి ఇలా ఉంటే... పొలం లేనివారికి కూడా ఆదాయ మార్గాలను ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా... కాలవలూ, చెరువు గట్లపైన యాపిల్‌, లిచీ, మల్బరీ, స్టార్‌ ఫ్రూట్‌, వాటర్‌ ఆపిల్‌ వంటివి నాటించి భూమిలేని వారూ ఆదాయం పొందేలా చూస్తున్నారు. దీంతో... ఆ గ్రామంలోని యువకులు ఉద్యోగాలకు దూర ప్రాంతాలకు వలసపోకుండా సొంతూళ్లోనే సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.