Begin typing your search above and press return to search.

2019 ఎన్నికల్లో జనసేన దెబ్బకు టీడీపీ ఓడిపోయిన సీట్లు ఇవే...!

ఈ రెండు పార్టీల వల్ల ఎవరికి లాభం ఎవరికి ఎక్కువ మేలు అన్నది ఒక వైపు చర్చకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అంటే 2019 ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన వేరు వేరుగా పోటీ చేశాయి

By:  Tupaki Desk   |   24 Oct 2023 10:37 AM GMT
2019 ఎన్నికల్లో జనసేన దెబ్బకు టీడీపీ ఓడిపోయిన సీట్లు ఇవే...!
X

ఏపీలో కొత్తగా పాత పొత్తు జనసేన టీడీపీ మధ్య కుదిరింది. రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాయి. ఈ రెండు పార్టీల వల్ల ఎవరికి లాభం ఎవరికి ఎక్కువ మేలు అన్నది ఒక వైపు చర్చకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అంటే 2019 ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన వేరు వేరుగా పోటీ చేశాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీ ఓట్లను జనసేన బాగా చీల్చింది

దీంతో టీడీపీ అనేక నియోజకవర్గాలలో దెబ్బ తిన్నది. అలా దెబ్బ తిన్న నియోజకవర్గాలు చూస్తే బిగ్ నంబర్ గానే ఉన్నాయని చెప్పాల్సి ఉంది. దాదాపుగా నలభై నియోజ్కవర్గాలు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా జనసేన టీడీపీకి దెబ్బ కొట్టి ఓడగొట్టింది. దాంతో ఆయన చోట్ల వైసీపీ చేతిలో టీడీపీ ఓడి ఆ సీట్లను వదిలేసుకోవాల్సి వచ్చింది.

ఆ విధంగా కేవలం 23 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అయిపోయింది. అలా టీడీపీకి చెక్ చెబుతూ ఓట్లను జనసేన భారీగా చీల్చిన ఈ మ్యాటర్ ఏంటో చూస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం సీటు. ఇక్కడ వైసీపీకి 5,777 మెజారిటీ మాత్రమే వస్తే జనసేనకు 7,557 ఓట్లు వచ్చాయి. అంటే ఆ ఓట్లు యాడ్ అయితే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్నదే అర్ధం అంటున్నారు.

విజయనగరం జిల్లాలో విజయనగరం సీటు కూడా అలాంటిదే. ఇక్కడ వైసీపీకి వచ్చిన మెజారిటీ 6,400, జనసేనకు వచ్చిన ఓట్లు 7,190గా ఉంది. విశాఖ జిల్లాలో చూసుకుంటే భీమునిపట్నం సీటు ఒకటి. ఇక్కడ వైసీపీకి వచ్చిన మెజారిటీ 9,712గా ఉంది. జనసేనకు వచ్చిన ఓట్లు 24,248గా ఉంది.

గాజువాకలో చూస్తే వైసీపీకి 16,573 ఓట్ల మెజారిటీ వచ్చింది. జనసేనకు 58, 539 ఓట్లు వచ్చాయి. అనకాపల్లిలో వైసీపీకి 8,169 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. యలమంచిలిలో చూస్తే వైసీపీకి 4,146 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 19,774 ఓట్లు వచ్చాయి.

తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే ప్రత్తిపాడులో వైసీపీకి 4,743 ఓట్ల మెజారిటీ వచ్చింది. జనసేనకు 6, 943 ఓట్లు వచ్చాయి. పిఠాపురంలో చూస్తే వైసీపీకి 14,992 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 28,011 ఓట్లు వచ్చాయి. కాకినాడ సిటీలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 14,111 గా ఉంటే జనసేనకు 30, 188 ఓట్లు వచ్చాయి. రామచంద్రాపురంలో వైసీపీకి 5,168 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 18,529 ఓట్లు వచ్చాయి.

ఇక ముమ్మిడివరంలో వైసీపీకి 5,547 ఓట్ల మెజారిటీ వస్తే, జనసేనకు 33,334 ఓట్లు వచ్చాయి. అమలాపురం ఎస్సీ రిజర్వుడు సీట్లో వైసీపీ మెజారిటీ 25,654 గా ఉంటే, ఇక్కడ జనసేనకు ఏకంగా 45,200 ఓట్లు వచ్చాయి. రాజోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో చూసుకుంటే జనసేన 1,167 ఓట్ల మెజారిటీతో గెలిచింది. మొత్తంగా 50, 053 ఓట్లు జనసేనకు దక్కాయి.

గన్నవరం ఎస్సీ రిజర్వుడు సీటులో వైసీపీకి 22 వేల ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 36 వేల ఓట్లు వచ్చాయి. కొత్తపేటలో వైసీపీ మెజారిటీ 4,038గా ఉంటే జనసేనకు 35,833 ఓట్లు వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే నిడదవోలులో వైసీపీకి వచ్చిన మెజారిటీ 21,688గా ఉంటే, జనసేనకు 23,073గా ఓట్లు వచ్చాయి. అచంటలో వైసీపీకి 12,886 ఓట్ల మెజారిటీ వచ్చింది. జనసేనకు 13,993 ఓట్లు వచ్చాయి. నరసాపురంలో వైసీపీకి 6,436 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ జనసేన రెండవ స్థానంలో ప్రత్యర్ధిగా ఉంటే టీడీపీ మూడవ ప్లేస్ లో ఉంది.

భీమవరంలో తీసుకుంటే వైసీపీకి 7,792 ఓట్ల మెజారిటీ వస్తే జనసేన రన్నర్ గా ఉంది, ఇక్కడ కూడా టీడీపీ మూడవ ప్లేస్ లో ఉంది. తణుకులో వైసీపీ 2,195 ఓట్ల మెజారిటీతో గెలిస్తే, జనసేనకు 31,961 ఓట్లు వచ్చాయి. తాడేపల్లిగూడెంలో వైసీపీకి 16,466 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 36, 197 ఓట్లు వచ్చాయి. ఏలూరులో వైసీపీకి వచ్చిన మెజారిటీ 4,072 గా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 16, 681 గా ఉన్నాయి.

క్రిష్ణా జిల్లాలో చూస్తే కనుక తిరువూరు ఎస్సీ రిజర్వుడు సీట్లో వైసీపీకి 1,118 ఓట్ల మెజారిటీ వస్తే జనసేనకు 3,320 ఓట్లు వచ్చాయి. అలాగే కైకలూరులో వైసీపీకి వచ్చిన మెజారిటీ 9,357 ఓట్లుగా ఉంటే జనసేనకు 10,738 ఓట్లు వచ్చాయి. పెడనలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 7,839 ఓట్లుగా ఉంటే, జనసేనకు వచ్చిన ఓట్లు 25,733గా ఉంది. ఇక మచిలీపట్నంలో వైసీపీకి వచ్చిన మెజారిటే 5,932 గా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 18,807గా ఉంది. అవనిగడ్డలో వైసీపీకి వచ్చిన మెజారిటీ తీసుకుంటే 20,725గా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 28,556 గా ఉంది.

పెనమలూరులో వైసీపీకి వచ్చిన మెజారిటీ 11,317గా ఉంటే జనసేనతో పొత్తులో ఉన్న బీఎస్పీకి 15,388గా ఓట్లు వచ్చాయి. విజయవాడ వెస్ట్ లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 7,671 గా ఉంటే, జనసేనకు వచ్చిన ఓట్లు 22,367గా ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 25 ఓట్లుగా ఉంటే జనసేన పొత్తులో ఉన్న సీపీఐకి 29,333 ఓట్లు వచ్చాయి.

గుంటూరు జిల్లాను తీసుకుంటే తాడికొండ ఎస్సీ రిజర్వుడ్ సీట్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 4,083 గా ఉంటే, జనసేనకు 4,992 ఓట్లు వచ్చాయి. మంగళగిరిలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 4,337గా ఉంటే, జనసేన మద్దతు ఇచ్చిన సీపీఐకి వచ్చిన ఓట్లు 10,135గా ఉన్నాయి. పొన్నూరులో వైసీపీకి వచ్చిన మెజారిటీ 1,112 గా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 12,033గా ఉంది.

వేమూరు ఎస్సీ రిజర్వుడు సీట్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ తీసుకుంటే 9,999గా ఉంది. ఇక్కడ జనసేనకు 13,038 ఓట్లు వచ్చాయి. తెనాలిలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 17,649 ఓట్లుగా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 29, 905గా ఉన్నాయి. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడ్ సీట్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 4,666గా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 26,371గా ఉంది.

ఇక నెల్లూరు సిటీలో చూస్తే వైసీపీకి వచ్చిన మెజారిటీ 1988గా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 5,503గా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో చూస్తే తిరుపతిలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 708 ఓట్లుగా ఉంటే జనసేనకు వచ్చిన ఓట్లు 12,315గా ఉన్నాయి. అలాగే, నగరిలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 2,708గా ఉంటే జనసేన మద్దతు ఇచ్చిన బీఎస్పీకి వచ్చిన ఓట్లు 3,044గా ఉన్నాయి.