Begin typing your search above and press return to search.

సునీల్ కనుగోలు సర్వేలో కాంగ్రెస్ కి వచ్చే సీట్లు ఇవే...!

ఇక లేటెస్ట్ గా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం తీసుకుంటే ఆయన సునీల్ కనుగోలుతో దాదాపుగా ఏడు గంటల పాటు చర్చలు జరిపారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 10:03 AM GMT
సునీల్ కనుగోలు సర్వేలో కాంగ్రెస్ కి వచ్చే సీట్లు ఇవే...!
X

సునీల్ కనుగోలు తెలంగాణాలో కాంగ్రెస్ కి అధికారం దక్కించే పనిలో ఉన్నారు. ఈ వ్యూహకర్త సక్సెస్ ఫుల్ గా కాంగ్రెస్ ని ప్రజలతో కనెక్ట్ చేస్తున్నారు. రెండు సార్లు తెలంగాణాలో గెలిచి మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీయారెస్ కి చుక్కలు చూపించేలా కాంగ్రెస్ ని రెడీ చేస్తున్నారు.

ఇక సునీల్ కనుగోలు కి కొత్త ఇమేజ్ కూడా ఉంది. కర్నాటకలో కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించిన వ్యూహాలు ఆయన సొంతం. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ కి రాజకీయ వ్యూహకర్తగా కీలకమైన బాధ్యతలను ఆయన సమర్ధంగా నిర్వహిస్తున్నారు.

ఈసారి తెలంగాణాలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి రావాలని సునిల్ కనుగోలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్ లో చేరికలు అన్నీ కూడా ఆయనే స్వయంగా చూస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఎక్కడ ఎవరు పోటీ చేయాలి, చేస్తే ఎవరు గెలిచేది అన్నది కూడా సునీల్ కనుగోలే చూస్తున్నారు.

ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి సీట్లు గ్యారంటీ చేసుకున్న వారి విషయంలో కూడా సునీల్ కనుగోలు వ్యూహాలే పనిచేస్తున్నాయని అంటున్నారు. ఇలా జంప్ అవుతున్న నాయకులు అంతా సునీల్ కనుగోలు తో చర్చలు జరిపి ఆ మీదటనే కాంగ్రెస్ లోకి వస్తున్నారు అని తెలుస్తోంది. వారు సునీల్ తో మాట్లాడి మాత్రమే తమ సీట్లు డిసైడ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం తీసుకుంటే ఆయన సునీల్ కనుగోలుతో దాదాపుగా ఏడు గంటల పాటు చర్చలు జరిపారు అని అంటున్నారు. ఈ చర్చలలో కాంగ్రెస్ కి తెలంగాణాలో ఎన్ని సీట్లు కచ్చితంగా వస్తాయో కూడా సునీల్ కనుగోలు వివరించారని అంటున్నారు.

ఆ తరువాత మాత్రమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒప్పుకుని కాంగ్రెస్ లో చేరారు అని అంటున్నారు. ఇక సునీల్ కనుగోలు రాజగోపాల్ రెడ్డికి చెప్పిన దాని ప్రకారం చూస్తే 51 సీట్లలో కాంగ్రెస్ కి క్లీన్ ఎడ్జ్ ఉందని అంటున్నారు. అంతే కాదు మరో 12 సీట్లలో రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉందని కూడా వివరించారని చెబుతున్నారు. అది కూడా చాలా తక్కువ తేడాతో కాంగ్రెస్ ఉంది అని కూడా పేర్కొన్నారట.

ఇంకా ఎన్నికలకు టైం నాలుగు వారాలు ఉంది కాబట్టి అవి కూడా కచ్చితంగా అటు నుంచి ఇటు మారుతాయని కూడా సునీల్ కనుగోలు చెప్పుకొచ్చారని అంటున్నారు. ఈ లెక్క తీసుకుంటే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి డెబ్బై సీట్లు ఎపుడూ తక్కువ కాకుండా వస్తాయని అంటున్నారు.

ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావాలనుకునే నేతలలో కూడా ఎన్నికల టైం కి కొంత మార్పు వస్తుందని కూడా సునీల్ కనుగోలు అంచనా వేస్తున్నారని అంటున్నారు. అలా కాంగ్రెస్ కి బ్రహ్మండమైన మెజారిటీతో సీట్లు దక్కబోతున్నాయని సునీల్ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. సునీల్ లెక్క ప్రకారం అయితే 70 సీట్ల దాకా అంచనా వేస్తున్నారని అవే టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు.

ఇలా పక్కా లెక్కలతో సునీల్ కనుగోలు తెలంగాణా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. దాంతో పాటు ఎక్కడెక్కడ బలంగా ఉన్న లీడర్స్ ఇతర పార్టీలలో ఉన్నారు, వారిని తీసుకుని రావడం వల్ల డ్యాం ష్యూర్ గా ఆయా సీట్లు పార్టీకి దక్కుతాయని కూడా ఆలోచించి మరీ ఆ దిశగా ఆపరేషన్ చేస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే సునీల్ కనుగోలు కాంగ్రెస్ కి తెలంగాణాలో కొత్త ఆక్సిజన్ ఎక్కిస్తూ ఈసారి అధికారం లోకి తీసుకుని వచ్చేందుకు తనదైన ఎన్నికల స్ట్రాటజీస్ ని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. మరి సునీల్ వలలో మరెంతమంది మజీ కాంగ్రెస్ నేతలైన ప్రస్తుత బీజేపీ నేతలు ఉన్నారో అన్న చర్చ కూడా నడుస్తోంది.