Begin typing your search above and press return to search.

తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే...!

ఇక మరో వైపు చూసుకుంటే అధికారంలో ఉన్న బీయారెస్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేయగలదు, కాంగ్రెస్ కూడా ఆ విషయంలో గట్టిగా ఉంటే కనుక ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది అని కచ్చితంగా చెప్పేయవచ్చు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 10:30 AM GMT
తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే...!
X

తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే అని వివిధ రకాలైన సర్వేల ద్వారా స్థానిక ప్రజల అభిప్రాయాల సేకరణ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని తీసుకుని నివేదికలు ఇస్తున్నారు. అలా కనుక చూసుకుంటే తెలంగాణాలో కాంగ్రెస్ గ్యారంటీగా గెలిచే సీట్ల జాబితా ఈ విధంగా ఉందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ 55 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. అందులో చూస్తే గెలుపు గుర్రాలు వరసబెట్టి ఇలా ఉంటారని అంటున్నారు.

బెల్లంపల్లి గడ్డం వినోద్

మంచిర్యాల కొక్కిరాల ప్రేమ సాగరరావు

బాల్కొండ సునీల్ కుమార్ ముత్యాల

జగిత్యాల టి జీవన్ రెడ్డి

రాం గుండం, ఎస్ ఎస్ రాజ్ ఠాకూర్

మంధని, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

పెద్దపల్లి చింతకుట విజయరామారావు

మెదక్ మైనంపల్లొ రోహిత్

సంగారెడ్డి తూర్పు జగ్గారెడ్డి

మల్కాజ్ గిరి మైనంపల్లి హనుమంతరావు

పరిగి టీ రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్

కొడంగల్ రేవంత్ రెడ్డి

గద్వాల్ సరితా తిరుపతయ్య

ఆలంపూర్ డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్

అచ్చంపేట డాక్టర్ చిక్కుడు వంశీ క్రిష్ణ

కల్వకుర్తి కేశిరెడ్డి నారాయణరెడ్డి

షాద్ నగర్ కె శంకరయ్య

కొల్లాపు జూపల్లి క్రిష్ణారావు

నాగార్జునసాగర్ జయవీర్ కుందూరు

హుజూర్ నగర్ నలమాడ ఉత్తం కుమార్ రెడ్డి

కోదాడ నలమాడ పద్మావతీరెడ్డి

అలేరు బీర్ల ఐలయ్య

భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ

ములుగు దానసరి అనసూయ సీతక్క

మధిర భట్టి విక్రమార్క మల్లు

భద్రాచలం పోడెం వీరయ్య

ఇలా కనుక చూసుకుంటే మొదటి జాబితాలో టోటల్ 55 కి గాను 27 మంది కాంగ్రెస్ తరఫున గ్యారంటీగా గెలుస్తారు అని అంటున్నారు. ఇక హోరాహోరీ పోటీగా ఉన్న సీట్లు కనుక చూస్తే ఆ జాబితా ఇలా ఉంది

మణికొడూరు

ఆందోళ్

ఉప్పల్

నాగర్ కర్నూల్

నకిరేకల్

నర్సింపేట్

ఇక రెండవ జాబితా తీసుకుంటే గ్యారంటీగా గెలిచే వారి జాబితా ఇలా ఉంది.

నారాయణ్ పేట్ పర్ణిక చిత్తం రెడ్డి

దేవరకొండ నేనావత్ బాలూ నాయక్

భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

తాండూర్ మనోహర్ రెడ్డి

జనగామ కొమ్మూరు ప్రతాపరెడ్డి

మహబూబాబాద్ మురళీ నాయక్

పినపాక పాయం వెంకటేశ్వర్లు

నిజామాబాద్ భూపతి రెడ్డి

ఇబ్రహీం పట్నం మలిరెడ్డి రంగారెడ్డి

ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు

మునుగోడు కె రాజగోపాల్ రెడ్డి

ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చొప్పదండి మేడిపల్లి సత్యం

రెండవ జాబితాలో 45 మందికి గాను 14 మందికి గ్యారంటీగా గెలిచే చాన్స్ ఉంది అంటున్నారు. ఇంకా డిసైడ్ చేయాల్సిన సీట్లు 19 ఉన్నాయి. ఇందులో కూడా కాంగ్రెస్ గెలిచే సీట్లు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ తీసుకుంటే కనుక ఇలా ఉంది.

పటాంచెరు

మిర్యాలగూడ

సూర్యాపేట్

తుంగతుర్తి

డోర్నకల్

ఎల్లెందు

వైరా

సత్తుపల్లి

కొత్తగూడెం

అశ్వారావుపేట

అంటే మొత్తం 19 సీట్లకు గానూ 10 సీట్లను కాంగ్రెస్ గ్యారంటీగా గెలుచుకుంటుందని అంటున్నారు. ఇలా మొత్తం చూసుకుంటే మొదటి జాబితాలో 27, రెండవ జాబితాలో 14, మూడవ జాబితాలో పది కలుపుకుని 51 సీట్లను కచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.

ఇక హోరా హోరు పోటీలో చూసుకుంటే మొదటి జాబితాలో ఆరు, రెండవ జాబితాలో 9, మూడవ జాబితాలో ఒకటి గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే టోటల్ గా ఈ నంబర్ 16గా ఉందన్న మాట. ఇక ఈ సీట్లలో కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు ఇచ్చినా కాంగ్రెస్ కి పెద్దగా లాభం లేదు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగే సీట్లు అన్నీ కూడా కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీట్లు కాబట్టి అని అంటున్నారు. అలా పొత్తులు పెట్టుకున్నా కాంగ్రెస్ కి ఏమీ లాభం లేదు అని తేల్చేస్తున్నారు

ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ గ్యారంటీగా గెలిచే సీట్లు 51 ఉంటే మరో పదహారు హోరా హోరీ పోరులో వస్తాయని అంచనా వేస్తునారు. అయితే మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ కావాలంటే అరవై సీట్లు వస్తే చాలు. ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ కి సింపుల్ మెజారిటీ కంటే మరో ఏడు సీట్లు ఎక్కువే వస్తాయని అంటున్నారు. అంటే ఆ నంబర్ 67 దాటి ఇంకా ముందుకే వెళ్తుంది అని అంటున్నారు.

ఇక మరో వైపు చూసుకుంటే అధికారంలో ఉన్న బీయారెస్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేయగలదు, కాంగ్రెస్ కూడా ఆ విషయంలో గట్టిగా ఉంటే కనుక ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది అని కచ్చితంగా చెప్పేయవచ్చు అని అంటున్నారు. ఇక బీజేపీ ఓట్ల షేర్ 12 శాతం లోపు కనుక ఉంటే కాంగ్రెస్ మరిన్ని సీట్లు గెలుచుకుని సూపర్ మెజారిటీతో ప్రభుత్వంలోకి వస్తుందని కూడా లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఈజీగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.