Begin typing your search above and press return to search.

ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగించే పాస్‌ వర్డ్స్ ఏవో తెలుసా?

ఈ క్రమంలో తాజాగా ఇండియన్స్ ఎక్కువగా వాడే పాస్ వర్డ్స్ పై కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:30 AM GMT
ఇండియన్స్  ఎక్కువగా ఉపయోగించే పాస్‌  వర్డ్స్  ఏవో తెలుసా?
X

ఈ మెయిల్ నుంచి ఫోన్ వరకూ... ఇక ఫైనాన్షియల్ ట్రన్సాంక్షన్స్ సంగతి సరే సరి... ప్రతీ దానికీ పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా ఉండటం అత్యంత కీలకం. అయితే చాలా మంది ఈ మెయిల్స్ కు ఇంట్లోవాళ్ల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ లను పాస్ వర్డ్స్ గా పెడుతుంటారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇండియన్స్ ఎక్కువగా వాడే పాస్ వర్డ్స్ పై కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

అవును.. 2023లో గ్లోబల్, ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ల్యాండ్‌ స్కేప్ ఒక సాధారణ సమస్యను తెరపైకి తెచ్చింది! ఇందులో బలహీనమైన పాస్‌ వర్డ్‌ ల వాడకం అనేది హాట్ టాపిక్ గా మారింది. నార్డ్ పాస్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో "123456" అనేది ప్రపంచవ్యాప్తంగా, భారతీయ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన పాస్‌ వర్డ్‌ గా నిలిచింది.

ముఖ్యంగా వినియోగదారులు తమ స్ట్రీమింగ్ ఖాతాల విషయానికి వస్తే మరింత బలహీనమైన ప్రవృత్తిని ప్రదర్శించారని, పటిష్టత లేని పాస్‌ వర్డ్‌ లను ఉపయోగించారని తెలిసింది. ఇదే సమయంలో భారతీయ వినియోగదారులు "ఇండియా@123" అనే మరో బలహీనమైన పాస్ వర్డ్ ని కూడా హైలైట్ చేసింది. ఇందులో "అడ్మిన్" అనేది మరో బలహీన పాస్ వర్డ్ గా వెలుగులోకి వచ్చింది.

ఇదే క్రమంలో సైబర్ బెదిరింపుల భయం ఎక్కువగా ఉన్నప్పటికీ "పాస్‌ వర్డ్", "పాస్@123", "పాస్‌ వర్డ్@123" వంటి పాస్ వర్డ్స్ కూడా చాలా సాధారణమైనవిగా కొనసాగుతున్నాయని నివేదిక వెల్లడించింది. దీంతో ఈ సైబర్‌ సెక్యూరిటీ రిస్క్‌ లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నార్డ్‌ పాస్ సీటీఓ టోమస్ స్మాలాకీస్ నొక్కిచెప్పారు.

ఇదే సమయంలో... పెరుగుతున్న సైబర్ బెదిరింపుల నేపథ్యంలో మెరుగైన పాస్‌ వర్డ్ భద్రత చాలా ప్రాముఖ్యమనే విషయం వినియోగదారులు గ్రహించాలని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క 2023 చివరి నాటికి భారతదేశం దాదాపు 3 మిలియన్ల సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల కొరతను ఎదుర్కొంటుందని అంచనా తెరపైకి వచ్చింది. దీంతో... ఈ కొరతను పరిష్కరించడానికి, నైపుణ్యం కలిగిన వర్క్‌ ఫోర్స్‌ ను అభివృద్ధి చేయడానికి సైబర్ సెక్యూరిటీ విద్య, శిక్షణ కార్యక్రమాలు, పబ్లిక్-ప్రైవేట్ సహకారాన్ని మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు!