Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ అమ్మాయిల లవ్ స్టోరీ బ్రేకప్.. అసలు కారణం ఇదేనట

దీంతో.. వీరి బ్రేకప్ వార్త ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది.

By:  Tupaki Desk   |   27 March 2024 9:45 AM GMT
భారత్ - పాక్ అమ్మాయిల లవ్ స్టోరీ బ్రేకప్.. అసలు కారణం ఇదేనట
X

సోషల్ మీడియాను నాన్ స్టాప్ గా ఫాలో అయ్యే వారికి అంజలి చక్ర.. సూఫీ మాలిక్ ఇద్దరు సుపరిచితులు. ఒకవేళ పరిచయం లేకున్నా.. వారిద్దరి గురించి తెలిస్తే మాత్రం మర్చిపోవటం కష్టం. ఎందుకంటే.. అమెరికాలో ఉండే ఈ భారత, పాకిస్థాన్ యువతుల మధ్య లవ్ రిలేషన్ ఉంది. మొదట్లో వీరి పరిచయం సాదాసీదాగా సాగినా తర్వాత.. వీరిద్దరు స్వలింగ సంపర్క ప్రేమగా వారిరిలేషన్ ను మార్చుకున్నారు. అనంతరం వారిద్దరు గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి అనుకుంటున్న వేళ.. అనూహ్యంగా తామిద్దరం విడిపోయిన విషయాన్ని అంజలి వెల్లడించారు. దీంతో.. వీరి బ్రేకప్ వార్త ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది.


భారత్ కు చెందిన అంజలి న్యూయార్కులో నివసిస్తోంది. సదరన్ కాలిఫోర్నియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆ జాబ్ ను వదిలేసిన ఆమె.. సోషల్ మీడియాలో ఫోటోలు.. వీడియోలతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మారింది. ఇదిలా ఉంటే.. 27 ఏళ్ల సూఫీ మాలిక్ పాకిస్థాన్ కు చెందిన మహిళ. లైఫ్ స్టైల్.. ఫ్యాషన్ కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది.

ఇస్లాం ఆధ్యాత్మిక కోణమైన సూఫీ ఫిలాసఫీ నుంచి ప్రేరణతో తన పేరుకు ముందు సూఫీగా పెట్టుకుంది. వీరిద్దరూ కలిసి సూఫీ అండ్ అంజలిఅనే ఒక యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి వీడియోలు పోస్టు చేస్తారు.ఈ లెస్బియన్ జంటకు భారీగా క్రేజ్ ఉంది. తొలిరోజుల్లో వీరిద్దరు కలిసి చేసిన వర్షం షూట్ భారీ హిట్ కావటమే కాదు.. వీరిద్దరికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఇదంతా బాగానే ఉన్నా.. ఇంతకూ వారి ప్రేమ ఎందుకు బ్రేకప్ అయ్యింది. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వారు విడిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి బదులుగా అంజలి చక్ర తాజాగా ఒక పోస్టులో ఆ విషయాన్ని షేర్ చేసింది. తమ ప్రయాణాలు మారుతున్నాయని.. మరికొన్ని రోజుల్లో జరగాల్సిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా పేర్కొంటూ.. సూఫీ మాలిక్ తనను మోసం చేసినట్లుగా పేర్కొంది. ఆమె విషయంలో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే సూఫీ మాలిక్ సైతం ఒక పోస్టులో తాను అంజలిని మోసంచేసినట్లుగా పేర్కొంది. అయితే.. అదెలాంటి మోసం అన్న విషయాన్ని ఇద్దరు రివీల్ చేయలేదు. మొత్తంగా సూఫీ మాలిక్ చేసిన మోసాన్ని భరించలేని అంజలి బ్రేకప్ చెప్పటమే కాదు.. దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ కావటం గమనార్హం. వీరి బ్రేకప్ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.