Begin typing your search above and press return to search.

''నాతో సె*క్స్ చేస్తావా లేదా, విమానం డోర్ ఓపెన్ చేయమంటావా ?''

ఈ నేపథ్యంలో తాజాగా విమానంలో ఓ వ్యక్తి చిల్లర చేష్టలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడానికి కారణమయ్యింది.

By:  Tupaki Desk   |   2 Aug 2024 10:00 PM IST
నాతో సె*క్స్  చేస్తావా లేదా, విమానం డోర్  ఓపెన్  చేయమంటావా ?
X

ఇటీవల కాలంలో విమానాల్లో జరుగుతున్న అనుచిత ప్రవర్తనలు, చిల్లర చేష్టలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాయలేని సంఘటనలు కూడా వెలుగులోకి వస్తోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా విమానంలో ఓ వ్యక్తి చిల్లర చేష్టలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడానికి కారణమయ్యింది. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఇటీవల కాలంలో విమాన ప్రయాణల్లో జరుగుతున్న సంఘటనలు కొన్ని ఆందోళన కలిగించేలా ఉంటే, మరికొన్ని అభ్యంతరకరంగా ఉంటే.. ఇంకొన్ని అసహ్యించుకునేలా ఉంటుంటాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో విమాన సిబ్బందిపై ఓ వ్యక్తి అనుచిత ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో 26 ఏళ్ల ఎరిక్ నికోలస్ గాప్కో జూలై 18న సీటెల్ నుంచి డల్లాస్ వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో ఏమైందో ఏమో కానీ... ఉన్నపలంగా వేసుకున్న చొక్కాను విప్పేశాడు! అనంతరం ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకు వెళ్లి సె*క్స్ కోసం ఫోర్స్ చేయడం కోసం ప్రపోజ్ చేశాడు. అంగీకరించకపోతే ఫ్లైట్ డోర్ ఓపెన్ చేస్తానంటూ బెదిరించాడు!

ఇదే సమయంలో విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులపైనా దాడికి పాల్పడ్డాడు. ఇతడి అనుచిత ప్రవర్తనకు విమానంలోని సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులూ షాక్ కి గురయ్యారు. అనంతరం సిబ్బందితో కలిసిన ప్రయాణికులు... నికోలస్ గాప్కోని బలవంతంగా పట్టుకుని కాళ్లను కట్టేశారు! దీంతో... సాల్ట్ లేక్ సిటీలో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది!

ఈ నేపథ్యంలో.. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఈ సందర్భంగా విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు, వారి చూచనలను పాటించడంలో విఫలమయ్యాడు, తోటి ప్రయాణికులపై అనుచితంగా ప్రవర్తించాడు, వారి భద్రతను ప్రమాదంలో పాడేశాడనే పలు అభియోగాలు అతడిపై మోపబడ్డాయని తెలుస్తోంది!