Begin typing your search above and press return to search.

గుజరాత్ లో వెలుగులోకి వచ్చిన నకిలీ టోల్ ప్లాజా వ్యవహారం

తాజాగా గుజరాత్ లో బమన్ బోర్ - కచ్ జాతీయ రహదారి పక్కన ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన నకిలీ టోల్ ప్లాజాను 1.5 రోజులుగా నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:36 PM GMT
గుజరాత్ లో వెలుగులోకి వచ్చిన నకిలీ టోల్ ప్లాజా వ్యవహారం
X

దేశంలో అవినీతి జాడ్యం వేగంగా పెరుగుతోంది. వారు ఏకంగా నకిలీ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి ప్రజల నుంచి అందినంత దండుకున్నారు. దాన్ని కనిపెట్టడానికి ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇది అధికారుల తప్పిదమో వారి చలాకీ తనమో కానీ వారి పాలిట వరంగా మారింది. ఈ లోగా వారు తమకు కావాల్సిన డబ్బును పోగు చేసుకుని పక్కకు జరగడం విశేషం.

తాజాగా గుజరాత్ లో బమన్ బోర్ - కచ్ జాతీయ రహదారి పక్కన ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన నకిలీ టోల్ ప్లాజాను 1.5 రోజులుగా నిర్వహిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించి డబ్బులు వసూలు చేసేవారు. ఈ రూట్ లో ఎక్కువగా ట్రక్కులు ఎక్కువగా రావడంతో వారి నుంచి సగం టోల్ ట్యాక్స్ చెల్లిస్తే చాలని ప్రలోభాలకు గురిచేసి డబ్బు దండుకుంటున్నారు.

ఏడాదిన్నర నుంచి వారు అందినంత పిండుకున్నారు. వాహనదారుల నుంచి అడ్డగోలుగా ట్యాక్స్ వసూలు చేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు చేస్తున్న నిర్వాకాన్ని గుర్తించి వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నుంచి విచ్చలవిడిగా వసూలు చేసిన డబ్బును తిరిగి తీసుకోవాలని కోరుతున్నారు.

అవినీతిలో ఇదో కొత్త రకమైన మోసం. ఎవరికి అనుమానం రాకుండా ఇంత కాలం ఎలా రన్ చేశారో తెలియడం లేదు. ఏదైనా జరిగితే వెంటనే స్పందించే అధికారులు ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేశారు? ఇందులో వారికి కూడా భాగం ఉందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈనేపథ్యంలో నకిలీ టోల్ ప్లాజా నిర్వహించిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులను చేయాలని అంటున్నారు.