Begin typing your search above and press return to search.

తనవల్ల ప్రమాదం... మృతుడి ఇంటికెళ్లి మౌనంగా దుఃఖించిన శునకం!

ఇటీవల చనిపోయిన తన యజామని కోసం ఆస్పత్రి వద్దే నెలల తరబడి తిండీ తిప్పలు మాని ఎదురుచూస్తున్న శునకం గురించి విన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:07 AM GMT
తనవల్ల ప్రమాదం... మృతుడి ఇంటికెళ్లి మౌనంగా దుఃఖించిన శునకం!
X

ఈ లోకంలో అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు ఏది అని అంటే... శునకం అని ఠక్కున సమదానం చెబుతారు. ఈ బిరుదుకు, ఈ పేరుకు, ఈ నమ్మకానికి శునకం ఏనాడూ చెడ్డపేరు తెచ్చుకోలేదు.. పైగా మనుషుల కంటే తాము విశ్వాసపాత్రులం అని చెప్పుకునే ప్రయత్నాలే చేస్తుంటాయి. ఇటీవల చనిపోయిన తన యజామని కోసం ఆస్పత్రి వద్దే నెలల తరబడి తిండీ తిప్పలు మాని ఎదురుచూస్తున్న శునకం గురించి విన్న సంగతి తెలిసిందే.

మొదట్లో దాని ఆవేదన మనిషి మనసుకు అర్ధం కాకపోయినా.. క్రమం క్రమంగా ఆ మార్చురీ చుట్టూ తిరుగుతుంటే అప్పుడు గ్రహించారు. ఆ శునకం గురించి తెలుసుకుని అయ్యో అననివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటకలో ఒక శునకం.. తన వల్ల చనిపోయాడని భావించి.. మృతుడి ఇంటికి వెళ్లి మౌనంగా దుఃఖించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం హార్ట్ టచ్చింగ్ గా ఉంది!

అవును... సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు, స్నేహితులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తుంటారు.. వారిని ఓదారుస్తుంటారు. అయితే... తిప్పేశ్‌ (21) అనే యువకుడు తన కారణంగా మరణించాడని గ్రహించిన ఒక శునకం... మృతుడి ఇంటికి ఇంటికి వెళ్లిన ఘటన హొన్నాళి తాలూకా క్యానికెరె గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో నాలుగు రోజుల కిందట తమ ఊరి నుంచి అనవేరి గ్రామానికి తిప్పేశ్‌ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈ సమయంలో రోడ్డుపై సడన్ గా ఒక శునకం అడ్డుగా వచ్చింది. దీంతో... దాన్ని తప్పించే ప్రయత్నంలో అతడు కింద పడి గాయపడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.

ఆ విషయం ఎలా గ్రహించిందో ఏమో కానీ... అతడు మృతి చెందిన మూడో రోజుకు తిప్పేశ్‌ ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది ఆ శునకం. అయితే... మొదట వీధి కుక్క అని భావించి తరిమేసినట్లు మృతుని మేనమామ చెబుతున్నారు. అయితే... ఎంత తరిమినా వెళ్లని ఆ శునకం... తిప్పేశ్‌ తల్లి పక్కన కూర్చుని మౌనంగా దుఃఖించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ సమయంలో విషయం గ్రహించిన కుటుంబ సభ్యులు దాన్ని అనునయించినా.. విపరీతమైన మూగ బాధను వ్యక్తం చేసిందట. చాలాసేపు అన్ని గదులనూ చూసి, తిప్పేశ్ ఫోటోలు చూసి తిరిగి వెళ్లిపోయిందని చెబుతున్నారు. దీంతో... ఈ శునకం ప్రవర్తన మానవత్వాన్ని తట్టిలేపినట్లుగా ఉందని విషయం తెలిసినవారు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు... మానవత్వం విషయంలో మనిషి ఎంత వెనుకబడిపోయాడనే విషయం అర్ధమవుతుంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు!