Begin typing your search above and press return to search.

ముఖాలు నల్లగా ఉన్నాయని విద్యార్థుల బహిష్కరణ.. స్కూలుకు షాకిచ్చిన కోర్టు

వివరాల్లోకి వెళితే కాలిఫోర్నియాలోని సెయింట్ ప్రాన్సిస్ హైస్కూల్ పై ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దావా వేశారు.

By:  Tupaki Desk   |   11 May 2024 1:30 PM GMT
ముఖాలు నల్లగా ఉన్నాయని విద్యార్థుల బహిష్కరణ.. స్కూలుకు షాకిచ్చిన కోర్టు
X

ముఖాలకు నల్లటి మాస్కులు వేసుకుని ఫొటోలు తీసుకున్నారనే ఆరోపణలతో ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తమ స్నేహితుడి కోసం ఇద్దరు విద్యార్థులు ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకోవడంతో విచారణ జరిపి వారిపై బహిష్కరణ వేటు వేశారు ఒక్కొక్కరికి రూ.8.2 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం కలిగించింది. ఇద్దరి పరిహారం కలిపితే రూ. 16 కోట్ల పైనే అవుతుంది.

వివరాల్లోకి వెళితే కాలిఫోర్నియాలోని సెయింట్ ప్రాన్సిస్ హైస్కూల్ పై ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దావా వేశారు. 2017లో మొటిమల చికిత్స కోసం టీనేజర్లు మాస్క్ ధరించినట్లు తెలిసింది. తమ స్నేహితుడు మొటిమల సమస్యతో బాధపడటంతో అతడకి సంఘీభావంగా ఇద్దరు విద్యార్థులు ముఖానికి మాస్క్ వేసుకుని సెల్ఫీ దిగారు.

దీంతో వీరి ముఖాలు నల్లగా కనిపించాయి. ఆ ఫొటో సోషల్ మీడియాలో 2020లో వైరల్ గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన స్కూల్ యాజమాన్యం ఇదో నేరంగా భావించి వారిని బలవంతంగా బయటకు పంపింది. దీనిపై ఎలాంటి విచారణ, వివరణ లేకుండానే స్కూల్ యాజమాన్యం తీసుకన్న చర్యలను తప్పుబడుతూ వారు దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం శాంటా క్లారా కౌంట్ జ్యూరీ సోమవారం తీర్పు వెలువరించింది. స్కూల్ యాజమాన్యానికి చురకలు అంటించింది.

స్కూల్ తీరు సక్రమంగా లేదని ఆక్షేపించింది. చట్టానికి ఎవరు అతీతులు కారు. స్కూలు పిల్లలు, కుటుంబాలకు అన్యాయం జరిగినందున వారికి 20 మిలియన్ల పరిహారం ఇవ్వాలని బాధితులు కోరడంతో కోర్టు నిరాకరించింది. దీనిపై అప్పీలు చేస్తామని పాఠశాల ప్రతినిధులు చెప్పారు. న్యాయ నిపుణుల సలహా మేరకు జ్యూరీ తీర్పు ఏకపక్షంగా ఉందని, మార్చాలని కోరుతున్నారు.