Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యేల తీరు సమంజసమేనా

పెద్దగా ప్రాధాన్యం లేని అంశాన్ని చూపించి ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండటం సమంజసంగా లేదని కొందరు అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 12:57 PM GMT
బీజేపీ ఎమ్మెల్యేల తీరు సమంజసమేనా
X

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలందరు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో వారి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 38, బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎలాంటి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందరు ప్రమాణ స్వీకారం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడానికి విముఖత చూపారు. పార్టీ ఆదేశాల ప్రకారం తాము ప్రమాణ స్వీకారం చేయమని తెగేసి చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. అందుకే ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.

వారు చెబుతుంది పిడివాదమని కొందరు వాదిస్తున్నారు. పెద్దగా ప్రాధాన్యం లేని అంశాన్ని చూపించి ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండటం సమంజసంగా లేదని కొందరు అంటున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరు విమర్శనాత్మకంగా మారింది. దీంతో వారు ప్రమాణ స్వీకారానికి ముందుకు రాకపోవడం గమనార్హం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారానికి ఎందుకు రావడం లేదని అడుగుతున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై అందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీసీని ప్రొటెం స్పీకర్ గా వారు ఒప్పుకోవడం లేదు. పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా అతడికి ఎందుకు ఆ పదవి అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు తీసుకున్ని నిర్ణయంపైనే పలు ఆరోపణలు వస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోవచ్చు. అందులో వీరు లేవనెత్తిన అంశం కూడా వివాదాస్పదమే. దీంతో దీనిపై ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుందని అంచనా వేస్తున్నారు.