Begin typing your search above and press return to search.

ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ పై దాడి చేసిన దేవరకొండ సుధీర్ బ్యాక్ గ్రౌండ్ ఇంతనా?

కట్ చేస్తే.. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవరకొండ సుధీర్ వ్యవహారం మాత్రం మిస్టరీగా మారింది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:07 AM GMT
ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ పై దాడి చేసిన దేవరకొండ సుధీర్ బ్యాక్ గ్రౌండ్ ఇంతనా?
X

నడి రోడ్డు మీద ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ ను కావాలి శివారులో అత్యంత అమానుషంగా దాడి చేసిన వైనానికి సంబంధించిన వీడియోలు చూసినోళ్లంతా నోరెళ్లబెట్టారు. నానా బూతులు తిడుతూ.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసిన వైనం చూసిన పోలీసులు సైతం విస్తుపోయారు. తెగింపు చూశామే కానీ మరీ ఈ స్థాయి బరితెగింపా? అంటూ షాక్ తిన్నారు.కట్ చేస్తే.. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవరకొండ సుధీర్ వ్యవహారం మాత్రం మిస్టరీగా మారింది. కావలికి చెందిన ఇతగాడి గురించి ఈ కేసు విషయంలో ఫోకస్ చేసిన పోలీసులు.. తమ విచారణలో బయటకు వచ్చిన వివరాలతో విస్తు పోతున్నారు. ఇక.. అతడి ఇంట్లోకి అడుగు పెట్టిన పోలీసుల కళ్లు చెదిరిపోవటమే కాదు.. అతడింట్లో నుంచి స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు.. సాధనా సంపత్తి పోలీసు వర్గాల్ని అవాక్కు అయ్యేలా చేసింది.

కావలి పట్టణంలోని తుపాన్ నగర్ లో ఉన్న అతడి ఇంటిని పోలీసులు పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి ఇల్లు ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ డెన్ కు మించి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అతడి లీలల గురించి తెలియజేయటమే కాదు.. ఇన్నేళ్లుగా అతడు చేసే పనులకు సంబంధించిన అంశాలన్ని బట్టబయలైనట్లుగా చెబుతున్నారు.

అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని చూసి.. పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకూ పోలీసులకు అతగాడి ఇంట్లో పోలీసులకు ఏమేం దొరికాయంటే..

- నాలుగు ఎయిర్ పిస్టల్స్

- నాలుగు రౌండ్ల బుల్లెట్లు

- నాలుగు వాకీ టాకీలు

- 2 కత్తులు

- రెండు ఫోల్డింగ్ ఐరన్ స్టిక్ లు

- లీడింగ్ చైన్

- నాలుగు బేడీలు

- 2 జామర్లు

- రూ.7 లక్షల క్యాష్, 5 ల్యాప్ టాప్ లు.. పదుల సంఖ్యలో ఫోన్లు

- మూడు ఖరీదైన కార్లు

ఇక.. ఇతగాడి ఇంటిని చూసిన పోలీసులు అవాక్కు అవుతున్నారు. ఇంద్ర భవనాన్ని తలపించేలా ఇంటి లోపలి వాతావరణం పోలీసులకు నోట మాట రాకుండా చేసింది. సీజన్ కు తగ్గట్లుగా మోసాలు చేయటంలో సుధీర్ గ్యాంగ్ ఆరి తేరినట్లుగా చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వేళ.. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో తన మనుషఉల్ని ఏర్పాటు చేసి.. కోటికి రూ.75 లక్షలు ఇస్తామని ప్రచారం చేశారు. అందుకు తగ్గట్లే మొదటిసారి మాత్రం మాటకు తగ్గట్లే డీల్ క్లోజ్ చేసేవారిన. రెండోసారి భారీ మొత్తంతో వచ్చే వారి నుంచి డబ్బు తీసుకొని వారిని మోసం చేసే వారని చెబుతున్నారు.

అంతేకాదు తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెబుతూ.. కేసీ బంగారం రూ.55 లక్షల వరకు ఉంటే.. దాన్ని రూ.35 లక్షలకే ఇస్తామని చెప్పితర్వాత హ్యాండ్ ఇస్తారని చెబుతున్నారు. ఒకవేళ.. అతడి దగ్గర డబ్బులు మోసపోయిన వారు.. తమ డబ్బుల గురించి అడిగితే దబాయించటమే కాదు.. వార్నింగులు ఇస్తూ భయాందోళనలకు గురయ్యేలా చేస్తుంటాడని గుర్తించారు.

అతగాడి విలాసవంతమైన ఇంటిని చూసి పెద్ద వాళ్లు సైతం బోల్తా పడేవాళ్లని.. పెద్ద ఎత్తున మోసపోయేవారని చెబుతున్నారు. అతడో గ్యాంగ్ ను ఏర్పాటు చేసి.. వారికి పోలీసు వేషాలు వేయించి.. దాడులు చేయటం.. పెద్ద ఎ్తున నగదును సీజ్ చేసినట్లుగా కలరింగ్ ఇచ్చి మోసం చేసేవాడు. ఒకవేళ ఎవరైనా తాము మోసపోయిన విషయాన్ని గట్టిగా ప్రశ్నిస్తే.. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చేవారిన చెబుతున్నారు. అంతేకాదు.. తమ కదలికలు బయట వారికి తెలీకుండా ఉండేందుకు జామర్లను ఉపయోగించే అతగాడి టాలెంట్ పోలీసుల్ని విస్మయానికి గురి చేసింది.