Begin typing your search above and press return to search.

ఎంత‌ప‌ని జ‌రిగింది.. రాజ‌య్యా?!

ముందు జ‌ర‌గ‌బోయేది ఊహించుకుంటే నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌లేరేమో.. అని అనిపిస్తుంది

By:  Tupaki Desk   |   10 Feb 2024 1:30 AM GMT
ఎంత‌ప‌ని జ‌రిగింది.. రాజ‌య్యా?!
X

ముందు జ‌ర‌గ‌బోయేది ఊహించుకుంటే నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌లేరేమో.. అని అనిపిస్తుంది. ఎందు కంటే.. బీఆర్ ఎస్ నాయ‌కుడు(మాజీ), మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య ప‌రిస్థితి చూస్తే.. అలానే అనిపిస్తోంది. రాజ‌య్య‌.. ఇటీవ‌లే బీఆర్ ఎస్‌కు రాజీనామా చేశారు. అంతేకాదు... చేసేవాడు గ‌మ్మున చేయ‌క‌.. మీడియా ముందు ముచ్చ‌ట్లు పెట్టిండు. బీఆర్ ఎస్ త‌న‌కు అన్యాయం చేసింద‌ని.. ఎస్సీల‌కు వాల్యూ లేద‌ని.. గిలా ఏమోమో చెప్పిండు. తీరా ఇందా చూ్స్తే.. ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీలో రెడ్ కార్పెట్ రెడీ అయింద‌ని అర్థ‌మైంది.

క‌ట్ చేస్తే.. వ‌రంగ‌ల్ సీన్‌.. హైద‌రాబాద్‌లో వేడెక్కింది. రాజ‌య్య‌కు వ్య‌తిరేకంగా గాంధీ భ‌వ‌న్‌లో మ‌హిళ‌లు ఆందోళ‌న‌కు దిగారు. వరంగల్ కు చెందిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ను ముట్టడించారు. తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వొద్దని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తాటికొండ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో మహిళ కార్యకర్తలకు మానాభిమానాలపై రక్షణ లేకుండా పోయిందన్నారు.

అంతేకాదు.. మ‌రింత దూకుడ‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌య్య కామాంధుడని.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవద్దని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మహిళా నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాజయ్య లాంటి కామాందుణ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే మహిళా కార్యకర్తలకు నాయకులకు రక్షణ ఉండదని అన్నారు.

కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు, అక్రమ కేసులకు పాల్పడిన ఘటనలు గుర్తు చేసుకోవాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు అన్నో వ్యయప్రయాసలు పడుతున్నారని తెలిపారు. మ‌ళ్లీ ఇప్పుడు త‌గుదున‌మ్మా అంటూ.. రాజ‌య్య పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వస్తే స‌హించేది లేద‌ని.. కాంగ్రెస్‌ను కూడా ఆయ‌న బ‌త‌క‌నివ్వ‌డ‌ని అంటున్నారు. దీనిని చూసిన వారు.. అయ్యో ఎంత ప‌ని జ‌రిగింది .. రాజ‌య్యా?!అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. ఇటు బీఆర్ ఎస్ పాయే.. అటు కాంగ్రెస్ రానివ్వ‌క‌పోయే.. ఇప్పుడు రాజయ్య ఏం చేస్తారో చూడాలి.