ఎంపీ శశి థరూర్‌ను ప్రశ్నించిన ఆయన కుమారుడు! వైరల్ వీడియో
భారత కాంగ్రెస్ ఎంపీ డా. శశి థరూర్ పాల్గొన్న ఓ చర్చా కార్యక్రమంలో అతని కుమారుడు ఇషాన్ థరూర్ స్వయంగా నిలబడి ప్రశ్నించడం వైరల్ అయ్యింది.
By: Tupaki Desk | 6 Jun 2025 8:37 PM ISTఅమెరికాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత కాంగ్రెస్ ఎంపీ డా. శశి థరూర్ పాల్గొన్న ఓ చర్చా కార్యక్రమంలో అతని కుమారుడు ఇషాన్ థరూర్ స్వయంగా నిలబడి ప్రశ్నించడం వైరల్ అయ్యింది. తండ్రి కొడుకుల మధ్య ఈ పరిణామం చాలా ఆసక్తి రేపింది.
ఈ సందర్భంలో ఇషాన్ థరూర్ వాషింగ్టన్ పోస్టులో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రశ్నించేందుకు వేదికపైకి లేచారు. "పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ పాత్రపై మీ వ్యాఖ్య ఏమిటి? ఆ దేశంపై ఆరోపణల్ని రుజువు చేయమని ఏ దేశమైనా భారత్‌ను కోరిందా?" అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నను చూసిన శశి థరూర్ చిరునవ్వుతో స్పందిస్తూ "ఇలా చేయకూడదు... ఇతను నా కొడుకు!" అంటూ సభలో నవ్వులు పూయించారు. అనంతరం ఆయన గంభీరంగా సమాధానం ఇస్తూ, "పహల్గామ్ దాడిపై ఎవరికీ సందేహం లేదు. భారత్‌ను ఆధారాలు ఇవ్వమని ఎవరూ కోరలేదు. అన్ని దేశాలకూ అసలు విషయం స్పష్టంగా తెలుసు" అని వివరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి-కొడుకుల మధ్య జరిగిన ఈ హాస్యంతో కూడిన ప్రశ్నోత్తరాలు, ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇది చూస్తుంటే, ప్రజాస్వామ్యంలో చర్చ, విమర్శలకు ఎటువంటి అవరోధం లేదని, అది ఇంటి లోపల నుంచే ప్రారంభమవుతుందని ఈ ఘటన రుజువు చేస్తోంది.