Begin typing your search above and press return to search.

సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మరో ముఖ్యమైన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 5:02 PM IST
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మరో ముఖ్యమైన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపే (గురువారం) తల్లులకు కానుకగా "తల్లికి వందనం" పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.


అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రేపటికి ఏడాది కాలం పూర్తవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా.. 67 లక్షల మందికి 'తల్లికి వందనం' పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఇస్తామన్న హామీ మేరకు పథకం అమలు చేయనున్నారు.


ఈ సందర్భంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. దీంతో.. తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా ఈ పథకం అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీవో విడుదల చేస్తుంది! కాగా.. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే.