Begin typing your search above and press return to search.

నా రాజ‌కీయ పార్టీ ఇదే..విజ‌య్ అధికారిక ప్ర‌క‌ట‌న‌

త‌ల‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ తెరంగేట్ర ప్ర‌చారం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నమైన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Feb 2024 9:16 AM GMT
నా రాజ‌కీయ పార్టీ ఇదే..విజ‌య్ అధికారిక ప్ర‌క‌ట‌న‌
X

త‌ల‌ప‌తి విజ‌య్ రాజ‌కీయ తెరంగేట్ర ప్ర‌చారం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నమైన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సొంత పార్టీ పెడుతున్నాడ‌ని...2026 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అయితే వీజ‌య్ మాత్రం వీటిపై ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో ప్ర‌చార‌మా? ఇందులో వాస్త‌వం ఎంటి? అన్న దానిపై సందిగ్గ‌ద‌త నెల‌కొంది. తాజాగా వాట‌న్నింటికి విజ‌య్ కొద్ది సేప‌టి క్రిత‌మే తెర దించేసారు. విజయ్ తన రాజకీయ రంగప్రవేశం గురించి అధికారికంగా ప్రకటించారు.

స్వ‌యంగా రాజ‌కీయ పార్టీ పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. 'తమిళక వెట్రి కజగం' పేరుతో తన నేతృత్వంలో ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా వెల్ల‌డించారు. 'పీపుల్స్ మూవ్‌మెంట్' అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు.. సామాజిక సేవలు చేసాన‌న్నారు. కానీ కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక.. ఆర్థిక రాజకీయ సంస్కరణలను తీసుకురావడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకు రాజ‌కీయ అధికారం కావాల‌ని...అందుకే తానే స్వ‌యంగా పార్టీ పెట్టిన‌ట్లు తెలిపారు.

ప్ర‌స్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో పాలనాపరమైన దురాచారాలు.. అవినీతి రాజకీయ సంస్కృతి.. కులమత విభజన వంటి దురాచారాలు పెరిగిపోయాయ‌న్నారు. వాటికీ విరుద్ధంగా ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పుకు నాయకత్వం వహించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే త‌న టార్గెట్ గా ప్ర‌క‌టించారు.

విజయ్ సేవాకార్యక్రమాల్లో పాల్గొన‌డం... స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్ ఇవ్వడం..వరద బాధితుల‌కు సహాయం చేయడం వంటివి విజయ్ స్వయంగా రావడం రాజకీయ రంగప్రవేశానికి సంకేతాలు సూచించాయి. ఇప్పుడు దాన్ని నిజం చేసారు. దీంతో త‌మిళ‌నాడు వ్యాప్తంగా ప్రేక్ష‌కాభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే విజ‌య్ రాజ‌కీయాల్లో బిజీ అయిన త‌ర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు.