బౌద్ద సన్యాసులకు ‘శృంగార’ ఎర.. థాయ్ లాండ్ సె*క్స్ కుంభకోణం
థాయ్‌లాండ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సె*క్స్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 18 July 2025 8:15 PM ISTథాయ్‌లాండ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సె*క్స్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మతపరమైన ఆచారాలు, కఠిన నియమాలకు కట్టుబడి జీవించే బౌద్ధ సన్యాసులు ఒక యువతి వలలో చిక్కుకుని బ్రహ్మచర్యాన్ని కోల్పోవడమే కాకుండా, ఆమె బ్లాక్‌మెయిల్‌కు గురై వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన బౌద్ధ ధర్మ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
సన్యాసులను వలలోకి దింపిన యువతి
ఒక యువతి తన చూపులతో సన్యాసులను రెచ్చగొట్టింది. క్రమంగా బౌద్ధ సన్యాసుల మానసిక స్థితిని దెబ్బతీసింది. మొదట సాధారణ పరిచయం స్థాయిలో ఉన్న ఆమె, ఆ తర్వాత వారు తట్టుకోలేని విధంగా ప్రవర్తిస్తూ వారిని శారీరకంగా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో కనీసం 11 మంది సన్యాసులు ఆమెతో శారీరక సంబంధంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె వారితో వ్యక్తిగత సన్నిహిత క్షణాలను వీడియోలు, ఫోటోల రూపంలో రహస్యంగా రికార్డు చేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది.
బ్లాక్‌మెయిల్, లైంగిక దోపిడీ, కోట్ల రూపాయల వసూళ్లు
సన్యాసుల వ్యక్తిగత వీడియోలు బయటపెడతానంటూ బెదిరిస్తూ ఆ యువతి వారి వద్ద నుంచి దాదాపు రూ.102 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో సన్యాసులు ఆమెను రోజుకు రూ.90,000 ఖర్చు పెట్టేలా చేస్తూ, ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమె వద్ద నుంచి సుమారు 80,000 ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు.
-‘మిస్ గోల్ఫ్’ పేరుతో దర్యాప్తు
ఈ యువతి “మిస్ గోల్ఫ్” అనే నామంతో ఇంతకాలం పనిచేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసి, ఆమె బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తక్కువ కాలంలో ఇంత మొత్తం ఆమె వద్దకు ఎలా వచ్చిందన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు ఈ ఘటన వెనుక మరిన్ని కోణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో ఇతర అంశాల్లోనూ విచారణ చేస్తున్నారు.
బౌద్ధ మఠాలపై విమర్శలు, బౌద్ధ సన్యాసుల ఆచారాలపై ప్రశ్నలు
థాయ్‌లాండ్‌లో బౌద్ధ సన్యాసులు సమాజంలో ఎంతో గౌరవంతో ఉంటారు. ధ్యానానికి, ధర్మ బోధనలకు ప్రతీకలుగా నిలిచే వీరి జీవితాలలో ఇటువంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగించింది. కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతున్న ధర్మానికి మచ్చగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. మఠాలు ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల కంటే ధన సముపార్జన కేంద్రాలుగా మారుతున్నాయన్న వాదనలు బలపడుతున్నాయి.
ప్రభుత్వ స్పందన: రాజకీయ, మతపరంగా ప్రభావితం
ఈ కుంభకోణంపై తీవ్రంగా స్పందించిన థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ తన పుట్టినరోజు వేడుకలకు సన్యాసులను ఆహ్వానించకూడదని నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధ సన్యాసులు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పెద్దస్థాయిలో దర్యాప్తు ప్రారంభించగా, ఇప్పటివరకు ఈ స్కాండల్‌లో ఉన్న సన్యాసులను పదవి నుంచి తొలగించారు.
తెరవాడ బౌద్ధం థాయ్‌లాండ్‌లో అత్యంత గౌరవనీయమైన మత వ్యవస్థ. అయితే కొందరు మానవ బలహీనతల వల్ల ధర్మాన్ని అపవిత్రం చేయడం బాధాకరం. ఈ ఘటనతో మొత్తం మత వ్యవస్థను దోషించకూడదని, ఇది కొందరి వ్యక్తిగత వైఫల్యం మాత్రమేనని పలు మత పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇది నైతికతకు, బ్రహ్మచర్యానికి పెట్టిన పరీక్ష. మతాన్ని ముసుగుగా వాడుకొని తప్పుదోవ పట్టినవారి భవిష్యత్తుపై ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది. ధర్మాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు ప్రజలందరిదీ. మతపరమైన ఆచారాలు స్వచ్ఛంగా ఉండాలంటే, అటువంటి వ్యవస్థలో ఉన్నవారు కూడా నిర్విరామంగా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
