బీజేపీ 'హిందీ' అమలుపై తిరుగుబాటు.. ఏకమైన థాక్రే బద్రర్స్
ఇప్పటిదాకా వేర్వేరుగా రాజకీయ యాత్ర సాగించిన ఈ ఇద్దరు ఇప్పుడు హిందీ భాషపై మహారాష్ట్ర ప్రభుత్వ ఉల్లంఘన నిర్ణయం నేపథ్యంలో ఏకం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
By: Tupaki Desk | 28 Jun 2025 8:00 AM ISTమహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో రాజకీయం అనే బాటలో కలిసి నడిచిన బాల్ థాక్రే వారసులు ఉద్ధవ్ థాక్రే –రాజ్ థాక్రేలు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ చేతులు కలుపుతున్నారు. ఇప్పటిదాకా వేర్వేరుగా రాజకీయ యాత్ర సాగించిన ఈ ఇద్దరు ఇప్పుడు హిందీ భాషపై మహారాష్ట్ర ప్రభుత్వ ఉల్లంఘన నిర్ణయం నేపథ్యంలో ఏకం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
-హిందీపై ఫడ్నవీస్ సర్కార్ నిర్ణయం.. పరిణామాలు
దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది తెలుగులో చెప్పాలంటే "నిప్పులో నూనె పోసినట్లైంది". మరాఠీ అస్మితపై గర్వించే థాక్రే కుటుంబానికి ఇది సహించదగిన విషయం కాకపోవడంతో ఇద్దరు సోదరులు ఉద్ధవ్ , రాజ్ తమ విభేదాలను పక్కనబెట్టి ఈ అంశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
-సంయుక్తంగా ఆందోళనలకు సిద్ధమైన సోదరులు
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) నేత రాజ్ థాక్రే జూలై 5న పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం జూలై 7న నిరసనలకు పిలుపునిచ్చినా… ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి జూలై 5న సంయుక్త నిరసన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని శివసేన వర్గ నేత సంజయ్ రౌత్ స్వయంగా ట్వీట్ చేస్తూ ధ్రువీకరించారు.
-బీఎంసీ ఎన్నికల ముందు బీజేపీకి పెద్ద షాక్?
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రెండు శివసేన వర్గాల మళ్లీ కలయిక బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. గత ఎన్నికల్లో బీజేపీ-శిండే కూటమి శివసేనను చీల్చగలిగినా… ఇప్పుడు ఉద్ధవ్-రాజ్ థాక్రేలు ఒకే వేదికపైకి రావడం శక్తి సమీకరణాన్ని మార్చేయగలిగే పరిణామం.
ఉద్ధవ్ థాక్రే తన బలాన్ని తిరిగి చాటుకునేందుకు, అలాగే బీజేపీకి ఝలక్ ఇవ్వాలన్న లక్ష్యంతో రాజ్ థాక్రేను కూడగట్టుకోవడాన్ని రాజకీయ విశ్లేషకులు మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణిస్తున్నారు.
ఇది కేవలం భాషా రుద్దడంపైనే కాదేమో, మరాఠీ గర్వాన్ని తిరిగి జాగృతం చేసే పోరాటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. థాక్రే బ్రదర్స్ మళ్లీ ఏకమవుతుండటంతో మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తి సమీకరణాలు ఎలా మారతాయో… బీజేపీకి దీని ప్రభావం ఎలాంటి దెబ్బగా మారుతుందో… రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనున్నాయి.
