Begin typing your search above and press return to search.

దేవుడున్నాడు సర్ ఉన్నాడు... బొమ్మను తిరిగిచ్చేందుకు వేల మైళ్లు!

మానవత్వానికి పరామితులు ఏమిటి అని అంటే చెప్పడం కష్టం. అది పరిస్థితులను బట్టి, వ్యక్తుల ఆసక్తి అవసరాన్ని బట్టి ఉంటాయి

By:  Tupaki Desk   |   29 Aug 2023 10:22 AM GMT
దేవుడున్నాడు సర్ ఉన్నాడు... బొమ్మను తిరిగిచ్చేందుకు వేల మైళ్లు!
X

మానవత్వానికి పరామితులు ఏమిటి అని అంటే చెప్పడం కష్టం. అది పరిస్థితులను బట్టి, వ్యక్తుల ఆసక్తి అవసరాన్ని బట్టి ఉంటాయి. ఈ క్రమంలో బొమ్మను పొగొట్టుకుని బాధపడుతున్న చిన్నారి ముఖంలో చిరునవ్వు నింపడం కోసం ఒక విమాన పైలట్ భారీ ప్రయత్నం చేశాడు. ఆ చిన్నారిని టచ్ చేశాడు.

అవును... ఒక చిన్నారి బొమ్మను తిరిగి ఇచ్చేందుకు ఒక పైలట్ ఏకంగా 5,880 మైళ్లు ప్రయాణించాడు. వివరాళ్లోకి వెళ్తే... టెక్సాస్‌ కు చెందిన రూడీ డొమింగ్యూజ్ కుటుంబంతో సహా కొన్ని రోజుల క్రితం ఇండోనేషియా పర్యటించారు. ఆ సమయంలో అతడితోపాటు అతడి తొమ్మిదేళ్ల కుమార్తె వాలెంటినా కూడా ఉంది.

ఈ సమయంలో ఆ బాలిక తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను కూడా వెంట తీసుకువెళ్లింది. పర్యటన అనంతరం ఆ బొమ్మ కనిపించలేదు. దీంతో ఇళ్లంతా వెతికినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారి బొమ్మ కోసం దిగులుపెట్టుకుంది.

అయితే టెక్సాస్‌ కు తిరిగి వచ్చే సమయంలో టోక్యో విమానాశ్రయంలో ఆగినప్పుడు చివరిసారిగా బొమ్మను చూసినట్లు తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. అయితే పేరెంట్స్ లైట్ తీసుకున్నా ఆ బాలిక మాత్రం ఆ బొమ్మను మరిచిపోలేకపోతుంది. దీంతో కూతురు బాధను చూడలేని తండ్రి ఆ బొమ్మ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి సహాయం కోరాడు.

ఎవరొకరు ఆ బొమ్మను కనుగొని ఉండరా.. తమ బాదను అర్ధం చేసుకోరా.. అని ఆలోచించాడు. ఈ సమయంలో అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన జేమ్స్ డానెన్ అనే పైలట్‌ ఈ పోస్టును చూశాడు. అనంతరం వారిని ఫోన్లో సంప్రదించాడు. అనంతరం ఆ బొమ్మను కనిపెట్టాడు.

దీంతో ఏకంగా టోక్యో నుంచి టెక్సాస్‌ కు వచ్చి బొమ్మను చిన్నారికి అందించాడు. ఫలితంగా ఆమె ముఖంలో చిరునవ్వు నింపాడు. ఈ సమయంలో తమ కూతురి మొఖంలో ఆనందం కలుగజేసిన పైలట్‌ కు కుటుంబసభ్యులంతా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా... తనకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అని పైలట్ తెలపగా... బీట్రైస్ (బొమ్మ) అంటే తనకు ఎంతో ఇష్టం అని.. ఆమె తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని.. దాన్ని పోగొట్టుకున్న సమయంలో గుండె ముక్కలైందని ఆ చిన్నారి తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.