Begin typing your search above and press return to search.

'సైబర్ ట్రక్' ప్రమాదమా? భద్రతా నిపుణులు ఏమంటున్నారంటే?

‘టెస్లా’ గురించి ప్రపంచానికే పరిచయం అవసరం లేదు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో ప్రపంచంలో నెం. 1 ప్లేస్ ను సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   14 Dec 2023 10:45 AM GMT
సైబర్ ట్రక్ ప్రమాదమా? భద్రతా నిపుణులు ఏమంటున్నారంటే?
X

‘టెస్లా’ గురించి ప్రపంచానికే పరిచయం అవసరం లేదు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో ప్రపంచంలో నెం. 1 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఈ కంపెనీ ‘సైబర్ ట్రక్’ అనే బుల్లెట్ ప్రూఫ్ కారును పరిచయం చేసింది. కంపెనీన సీఈవో ఎలన్ మస్క్ అట్టహాసంగా దీన్ని ప్రారంభించాడు. అయితే, ఈ కారును కొన్నేళ్ల క్రితం రిలీజ్ చేసినా భద్రతా పరమైన కారణాలు తలెత్తాయి. దీంతో మరిన్ని పరిశోధనల కోసం వెనక్కి తీసుకున్నాడు. అన్ని పరిశోధనలు పూర్తయి అత్యాధునికగా.. మరింత దృఢంగా ఇప్పడు అందు బాటులోకి తీసుకువచ్చాడు ఎలన్ మస్క్. దీని తయారీలో దృఢమైన స్టీల్ వాడడం వల్ల రోడ్డుపై ప్రమాద తీవ్రతను పెంచుతుందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. పాదచారులు, సైకిలిస్టులకు ఇది మరింత ప్రమాదకరంగా మారతుందని చెప్తున్నారు. దని గురించి పూర్తి వివరాలను చూద్దాం.

ఇవీ భద్రతా లోపాలు..

టెస్లా ‘సైబర్‌ ట్రక్’ను కోణీయ డిజైన్ ను ఉపయోగించారు. దీనితో పాటు ని బాడీ దృఢంగా ఉండేందుకు గట్టి స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగించారు. దీని బాటసారులకు చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాంతకమైనదిగా పరిణమించవచ్చు. దీంతో పాటు రోడ్లపై ఇతర వాహనాలను ఢీ కొడితే దారుణంగా దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 నవంబర్, 2023లో జరిగిన ఒక ఈవెంట్ లో ప్రసారం చేసిన క్రాష్ టెస్ట్ వీడియోలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. వీటిని చూసిన భద్రతా అధికారులు ఇది సృష్టించే ప్రమాదాలపై అంచనా వేశారు. కచ్చితత్వం కోసం క్రాష్‌ టెస్ట్‌ డేటా అవసరమని రాయిటర్స్‌ వార్తా సంస్థకు తమ అభిప్రాయం చెప్పారు. ఈ వాహనానికి ఉపయోగించే స్టీల్ దృఢంగా ఉంది. ఏదైనా ప్రమాదానికి గురైతే బలమైన గాయాలతో పాటు ప్రాణాపాయం జరగవచ్చు.

మస్క్ అభిప్రాయం.

టెస్లాకు సీఈవో అయిన ఎలాన్ మస్క్ సైబర్ ట్రక్ పై ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో మాట్లాడారు. ఇతర ట్రక్కులతో పోలిస్తే ఇది అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తుందని చెప్పారు. వారు చెప్తున్నట్లుగా బాటసారులు, ప్రయాణికులు, సైక్లిస్టులకు ఎటువంటి హానీ ఉండదని చెప్పారు. ఇది ఫ్లాట్ ప్లేన్‌, పొడవాటి సరళ అంచులతో తయారు చేయబడింది. 1985 చలనచిత్రం ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’లో డెలోరియన్ కారు తర్వాత స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్స్‌టీరియర్‌తో వస్తున్న మొదటి కారు సైబర్ ట్రక్ అని వివరించారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని ఫ్యాక్టరీలో లాంచ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు. టెస్లా కోల్డ్‌రోల్డ్, స్టెయిన్‌లెస్ బాడీ ప్యానెల్‌ క్రాష్ సమయంలో ప్రభావాన్ని గ్రహించేలా రూపొందించినట్లు మస్క్ చెప్పారు. కారు ముందు వెనుక నిర్మాణాలు క్రాష్‌ సమయంలో సక్రమంగా ప్రభావం చూపుతాయని అన్నారు. భద్రతా పరమైన అంశాలను చూపించినా షేర్ మార్కెట్ లో టెస్లా షేర్లు మాత్రం దూసుకెళ్తూనే ఉన్నాయి. అయితే 2025లో 2,50,000 వరకు సైబర్ ట్రక్ లను ప్రొడ్యూస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ చెప్పారు.