Begin typing your search above and press return to search.

ఎగిరే టెస్లా కార్.. ఎలాన్ మస్క్ మరో సంచలనం!

అయితే, ప్రదర్శనలో ఆకట్టుకునే విన్యాసాలు చేయడం వేరు.. ప్రజలు రోజువారీ ప్రయాణాలకు ఉపయోగించగలిగే ఫ్లయింగ్ కారును తయారు చేయడం వేరు.

By:  Tupaki Desk   |   16 Oct 2026 9:07 AM IST
ఎగిరే టెస్లా కార్.. ఎలాన్ మస్క్ మరో సంచలనం!
X

ఎలాన్ మస్క్ మరోసారి తన భవిష్యత్ ఆలోచనలతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచుతున్నారు. రోడ్లపై దూసుకెళ్లడమే కాదు.. గాల్లోనూ విన్యాసాలు చేయగల కారు అనే ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టెస్లా నెక్స్ట్ జనరేషన్ రోడ్‌స్టర్‌కు సంబంధించి స్పేస్‌ఎక్స్ టెక్నాలజీ వినియోగంపై చర్చ జరుగుతోంది.

ఒక స్పోర్ట్స్ కారు రోడ్డుపై వేగంగా దూసుకెళ్లి, ప్రత్యేక సాంకేతికతతో గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది? వినడానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా.. ఇలాంటి ఆలోచనలతోనే భవిష్యత్ టెక్నాలజీకి కొత్త దారులు తెరుచుకుంటాయి.

అయితే, ప్రదర్శనలో ఆకట్టుకునే విన్యాసాలు చేయడం వేరు.. ప్రజలు రోజువారీ ప్రయాణాలకు ఉపయోగించగలిగే ఫ్లయింగ్ కారును తయారు చేయడం వేరు. భద్రత, బ్యాటరీ సామర్థ్యం, గాల్లో స్థిరత్వం, ప్రభుత్వ అనుమతులు వంటి అంశాలపై ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి.

టెస్లా ఈ రోడ్‌స్టర్‌ను తొలిసారిగా 2017లో ప్రకటించింది. అనేక ఆలస్యాల తర్వాత 2028లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

మస్క్ ఆలోచన నిజమైతే రవాణా రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అయితే, ఈ ఎగిరే కారు నిజంగా మన ముందుకు వస్తుందా? లేక మరో భవిష్యత్ ప్రయోగంగానే మిగిలిపోతుందా? అన్నది వేచి చూడాలి.