Begin typing your search above and press return to search.

ఉగ్రవాది ఇంటరాగేషన్‌... హమాస్ కీలక విషయాలు వెలుగులోకి!

ఈ విషయాన్ని హమాస్‌ నాయకుడు ఒకరు స్వయంగా వెల్లడించడంతోపాటు... సైన్యానికి దొరికిన ఒక ఉగ్రవాది ఇంటరాగేషన్‌ లో వెలుగులోకి వచ్చిందంట.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:16 AM GMT
ఉగ్రవాది ఇంటరాగేషన్‌... హమాస్  కీలక విషయాలు వెలుగులోకి!
X

ఇజ్రాయెల్‌ పై హమాస్‌ దాడి కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని స్థాయిలో జరిగిన ఈ ఉగ్రదాడి 20 నిమిషాలలో సుమారు 5000 రాకెట్లతో గాజా నుంచి ప్రారంభమైంది. దీంతో చాలా సేపటి తర్వాత ఈ షాకింగ్ సంఘటన నుంచి తేరుకున్న ఇజ్రాయేల్.. అంతకు మించి అన్నట్లుగా ప్రతిదాడి చేస్తుంది. అయితే... హమాస్ ఈ స్థాయిలో దాడి చేయడానికి ఇజ్రాయేల్ అలసత్వమే కారణం అని నిన్నటివరకూ కథనాలొస్తే... ఆ అలసత్వానికి హమాస్ అనుసరించిన వ్యూహం అసలు కారణం అని అంటున్నారు.

అవును... ఇజ్రాయెల్‌ పై హమాస్‌ దాడి ప్లాన్‌ అత్యంత గోప్యంగా ఉంచడంతోపాటు... మరో వైపు కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌ కు చెందిన మొస్సాద్‌, ఐడీఎఫ్‌ బలగాలను ఏమార్చే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిందని అంటున్నారు. ఈ విషయాన్ని హమాస్‌ నాయకుడు ఒకరు స్వయంగా వెల్లడించడంతోపాటు... సైన్యానికి దొరికిన ఒక ఉగ్రవాది ఇంటరాగేషన్‌ లో వెలుగులోకి వచ్చిందంట. ఈ విషయాలు విని ఇది హమాస్ మార్కు వంచన అని అంటున్నారట అధికారులు.

ఐడీఎఫ్‌ బలగాలు ఓ హమాస్‌ ముష్కరుడిని అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించే సరికి... ఈ వ్యూహాలకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే... దాడికి ఐదు గంటల ముందు మాత్రమే తమకు దాడి చేస్తున్న ప్రాంతం గురించి చెప్పారని ఆ ఉగ్రవాది ఇంట్రాగేషన్ లో వెల్లడించాడట.

దీనికోసం ప్రత్యేకంగా 1,000 మందికి దీనికోసం ట్రైనింగ్ ఇచ్చారని చెబుతుంటారు. ఇదే సమయంలో మొత్తం 15 చోట్ల సరిహద్దు కంచెను కత్తిరించినట్లు చెప్పాడు. అయితే... తాము ఇజ్రాయెల్‌ లో చొరబడే సమయానికి అక్కడ సైన్యం లేకపోవడంతో ఆశ్చర్యపోయామని.. ఇదే సమయంలో తామంతా కలిసి ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి.. రెండు గంటల పాటు నడిపించి గాజాలోకి తీసుకొచ్చినా కూడా ఇజ్రాయెల్‌ దళాలు కనిపించలేదని చెప్పుకొచ్చాడంట.

ఇదే సమయంలో... ఇజ్రాయెల్‌ పై దాడికి కుట్ర పన్నుతున్నట్లు ఏమాత్రం బయటకు పొక్కనీయకుండా హమాస్‌ అగ్రనాయకత్వం జాగ్రత్త పడిందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్‌ తో తాము పోరాటానికి సిద్ధంగా లేమనే సంకేతాలు గత కొన్నాళ్లుగా హమాస్‌ నుంచి వస్తున్నాయని పేర్కొంది. ఇది వారి వ్యూహంలో ఒక భాగమని తెలిపింది.

ఇదే క్రమంలో ప్రస్తుతం లెబనాన్‌ లో ఆశ్రయం పొందుతున్న హమాస్ సంస్థకు చెందిన అలీ బరాఖే ఈ వ్యూహంపై మరిన్ని కీలక విషయాలు వెల్లడించారు. అతడు బీరుట్‌ లో విలేకర్లతో మాట్లాడుతూ... ఇజ్రాయెల్‌ పై దాడి వ్యూహం గురించి హమాస్‌ లోని అత్యంత సీనియర్‌ కమాండర్లలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసని పేర్కొన్నాడు. ఇదే సమయంలో దాడికి నిర్ణయించిన పక్కా సమయం గురించి కూడా అతి తక్కువ మంది హమాస్‌ కమాండర్లకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ పై భారీ దాడికి కుట్ర పన్నుతున్నట్లు ఏమాత్రం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడిన హమాస్... అదే సమయంలో గాజా వాసులు అధిక ఆదాయం పొందేందుకు ఇజ్రాయెల్‌ లో పనిచేసేలా ఎక్కువ పర్మిట్లు సాధించడంపైనే తమకు ఆసక్తి ఉందన్నట్లు నమ్మించిందట. దీంతో... హమాస్ ను అతిపెద్ద ప్రమదంగా ఇజ్రాయేల్ పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు. ఈ రేంజ్ లో ప్లాన్ చేసిన హమాస్... ఇజ్రాయేల్ పై మెరుపు దాడి చేసింది.